| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజావాణి రద్దు

స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజావాణి రద్దు

జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డి వెల్లడి

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన సందర్భంగా ప్రజావాణి రద్దు చేశామన్నారు. తిరిగి ఎన్నికల కోడ్ ముగిశాకనే ప్రజావాణి కొనసాగుతుందని ఆయన వివరించారు.

Previous ప్రేమ పేరుతో కానిస్టేబుల్ మోసం... అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
Next ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుండి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు
ADVERTISEMENT