Posted on 2025-10-04 18:49:03
పాల్వంచ మండలంలో కొత్వాల విస్తృతపర్యటన
డైలీ భారత్, పాల్వంచ: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం వలనే సాధ్యం అవుతుందనీ రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ మండలంలోని పలు గ్రామాలలో శనివారం కొత్వాల తో పాటు కాంగ్రెస్ నాయకులు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్బంగా జగన్నాధపురం, నాగారం గ్రామాల్లో జరిగిన సమావేశాల్లో కొత్వాల మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమం కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నదన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థలు ZPTC, MPTC, సర్పంచ్ ల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించేలా కార్యకర్తలు కృషి చేయాలని కొత్వాల అన్నారు.
ఈ కార్యక్రమాల్లో మాజీ ZPTC సభ్యులు యర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, ధర్మసోత్ ఉపేందర్, కొండం పుల్లయ్య, పెండ్లి రామిరెడ్డి, బాదర్ల నాగేశ్వరరావు, బానోత్ బాలాజీ, కామాచారి, బ్రహ్మచారి, కుమార్, నాగారం కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >