| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

విజయదశమి పురస్కారాలు-2025 కు పాకాల శంకర్ గౌడ్ ఎంపిక

విజయదశమి పురస్కారాలు-2025 కు పాకాల శంకర్ గౌడ్ ఎంపిక

డైలీ భారత్, హైదరాబాద్: సాహితీ కళాసేవ సమితి, హైదరాబాద్ వారు ప్రతి ఏటా రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి విజయదశమి పురస్కారాలు అందిస్తున్నారు. 2025 విజయదశమి పురస్కారాలకు విద్యారంగంలో విశేష సేవలందించి ఎందరో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన పాకాల శంకర్ గౌడ్ ఎంపిక అయ్యారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో కృషిచేసిన 25 మంది కి ఈ సంవత్సరం విజయదశమి పురస్కారాలు అందజేశారు. ప్రస్తుతం 

పాకాల శంకర్ గౌడ్ కుసుమరామయ్య బాలుర ఉన్నత  పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (భౌతిక శాస్త్రం) గా పని చేస్తున్నారు.

27 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో నిబద్ధతతో పనిచేస్తూ విద్యార్థుల్లో శాస్త్రీయ పరిజ్ఞానం పెంపొందించడానికి నిరంతరం కృషి చేస్తున్న శంకర్ గౌడ్ ను ఈ సంవత్సరం విజయదశమి పురస్కారం వరించింది. వృత్తిలోనే రాణిస్తూ వివిధ సామాజిక అంశాలపై  200కు పైగా ఆర్టికల్స్ ని రాస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నారు. బతుకమ్మ దసరా సంబరాల్లో భాగంగా తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాదులో సాహితీ కళా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు స్వప్న కిషోర్ గారి చేతుల మీదుగా శంకర్ గౌడ్ ఈ అవార్డును అందుకున్నారు.

శంకర్ గౌడ్ విజయదశమి పురస్కారానికి ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోతిలాల్, ఉపాధ్యాయ బృందం మరియు టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు  రవీందర్ , రాజు లు ప్రత్యేకంగా  శుభాకాంక్షలు తెలియజేశారు.

శంకర్ గౌడ్ సేవలను గుర్తించి గత ఏడాది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించింది.

Previous గోద్రెజ్ పామాయిల్ పరిశ్రమ సత్వరమే పూర్తి చేయాలి
Next పోలీస్ వాహనాల పాత సమానులు మరియు పాత జిమ్ సమానులు బహిరంగ వేలం
ADVERTISEMENT