| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మహర్నవమి సందర్భంగా శ్రీ వారాహి అమ్మవారి ఆలయంలో విశేష పూజలు

మహర్నవమి సందర్భంగా శ్రీ వారాహి అమ్మవారి ఆలయంలో విశేష పూజలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: శ్రీ దేవీశరన్నవరాత్రుల మహర్నవమి సందర్భంగా నగరంలోని శ్రీ వారాహి మాత ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. సాయంత్రం 7.30 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక అభిషేకాలు, పుష్పార్చన, మంగళహారతి నిర్వహించగా అనంతరం శ్రీ వారాహి మూల మంత్ర హవనం వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి దర్శనం చేసుకుని ఆధ్యాత్మిక పరవశాన్ని పొందారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ మాట్లాడుతూ, వారాహి అమ్మవారి ఆశీర్వాదం పొందినవారికి జీవితం సాఫల్యం అవుతుందని, నవరాత్రులు భక్తి, శక్తి, జ్ఞానం కలిసే పర్వదినాలు కావడంతో ప్రతి కుటుంబం ఈ సమయాన్ని పవిత్రతతో, సత్సంకల్పాలతో గడపాలని సూచించారు. అలాగే అమ్మవారి కృపతో నిజామాబాద్ మరింత ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందుతోందని, ఈ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి భక్తుడికి అమ్మవారి దయాభిక్ష లభించాలని ఆకాంక్షించారు.

కార్యక్రమం అనంతరం భక్తులకు అల్పాహారం విందు చేశారు.

Previous మహాత్మా గాంధీ జయంతి రోజున యదేచ్ఛగా రహస్యంగా మద్యం, మాంసం విక్రయాలు
Next దసర సందర్భంగా భక్తులతో పలు ఆలయాలు కిటకిట
ADVERTISEMENT