డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: దసరా పండగ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సాయంత్రం నుండి జిల్లా కేంద్రంలో ఉన్న పలు ఆలయాలను భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిలకంటేశ్వరాలయం, ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి ఆలయం, అమ్మ వెంచర్లో గల శ్రీ వారహి అమ్మవారు ఆలయం, గంగ స్టాండ్ ఫేస్ టూ గంగ స్టాండ్ ఫేస్ 2 లో గల ఉత్తర తిరుపతి శమీ పూజ నిర్వహించారు. దసరా రోజు శమీ వృక్షానికి గల చెట్ల కొమ్మలను పూజిస్తే ఎంతో పుణ్యఫలం అని వేదపండితులు పేర్కొన్నారు. అందుకే ప్రతి ఏటా శమీ పూజ కార్యక్రమం భక్తుల పేరుమీద నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉత్తర తిరుపతి క్షేత్రంలో 2017 శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద స్వామి ఫోటోతో బెల్లం తో తులాభారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు నగరం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
News
దసర సందర్భంగా భక్తులతో పలు ఆలయాలు కిటకిట