| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఉద్యోగ విరమణ పొందిన డిప్యూటీ ఈఈ పీఆర్ ఆర్.గిరిధర్ కు సన్మానం

ఉద్యోగ విరమణ పొందిన డిప్యూటీ ఈఈ పీఆర్ ఆర్.గిరిధర్ కు సన్మానం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:పంచాయిరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో దశాబ్ధాలుగా సేవలందించిన ఆర్.గిరిధర్ కు ఘన సన్మానం చేశారు. ఇటీవల ఎల్లారెడ్డి డివిజన్ డిప్యూటీ ఈఈగా పని చేస్తూ ఆర్.గిరిధర్ పదవి విరమణ పొందడంతో సిఐడి సిఐ ఆంజనేయులుతో పాటు స్నహితులు సన్మానించారు.  41 సంవత్సరాలు పాటు పంచాయిరాజ్ శాఖలో వివిధ హోదాల్లో పని చేసిన గిరిధర్ ఈ నెల పదవి విరమణ పొందారు. గతంలో గిరిధర్ జనగామా, ధర్పల్లి, జక్రాన్ పల్లి, కామారెడ్డి, తాడ్వాయిలో ఏఈగా పని చేశారు. ప్రస్తుతం ఎల్లారెడ్డి పీఆర్ విభాగంలో ఈఈగా పని  చేస్తూ రిటైర్డ్ అయ్యారు. దీంతో  స్నేహితులు, బంధువులు ఆర్.గిరిధర్ ను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో భార్య ఉమాదేవి, కూతుళ్ళు ప్రవళిక, ప్రవర్ధిని, శ్రీనివాస్, ఆర్.శ్రీధర్, స్నేహితులు సిఐ ఆంజనేయులు, ప్రకాష్, పోచపురం ఎల్లన్న, ఎడపల్లి నర్సింగ్ తదితరులున్నారు.

Previous భగవాన్ దాస్ కాలనీ అమ్మవారి సన్నిధిలో మహా అన్నదాన కార్యక్రమం
Next పార్టీలకతీతంగా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని పరామర్శించిన ప్రజా ప్రతినిధులు
ADVERTISEMENT