| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

140 మంది సిబ్బందికి 2000 చొప్పున అందచేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

140 మంది సిబ్బందికి 2000 చొప్పున అందచేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ఉత్తమ సిబ్బంది 5 మందికి  5000 చొప్పున అందజేసిన ఎమ్మెల్యే

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: పట్టణ పురవీధుల్లో నిరంతరం శ్రమించే మున్సిపల్ సిబ్బందికి ఒక మాట ఇచ్చారు నాయకుడు వీర్లపల్లి శంకర్. వారి కష్టానికి కన్నీళ్ళకు తోడుగా దసరా పండుగ సందర్భంగా ఓ కానుకను ఇస్తానని మూడు నెలల కింద షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వారికి హామీని ఇచ్చారు. ఆ పదం ఒక భరోసాగా... ఆ హామీ ఒక ఆశగా... కార్మిక మనసుల్లో ఒక కోరికగా నిలిచింది... నేడు వారందరి కోరికను తీరుస్తూ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 140 మంది మున్సిపల్ సిబ్బందికి 2000 చొప్పున దసరా కానుకను అందజేశారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సునీత రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందికి కనుకలను అందజేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్యఅతిథిగా హాజరై సిబ్బందికి దసరా కానుకను అందజేశారు. అదేవిధంగా తమ డిపార్టుమెంటులో ఉత్తమ సిబ్బంది 6 6 మందికి  5000 చొప్పున ప్రోత్సాహకాని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మున్సిపల్ సుందరీకరణకు నిరంతరం కృషి చేస్తున్న సిబ్బంది సేవలు వెలకట్టలేనివని, అమ్మ కంటే గొప్పోళ్ళుగా నిలుస్తారని అన్నారు. అలాంటి కార్మికులకు తన వంతుగా సహాయం అందజేయాలనే ఉద్దేశంతోనే 140 మంది మున్సిపల్ సిబ్బందికి 2000 చొప్పున దసరా కానుక అందజేయాలని అనుకున్నానని, ఆ మేరకే నేడు వారికి అందజేయడం జరిగిందన్నారు. సిబ్బందికి దసరా కనుక అందజేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం పలువురు సిబ్బంది ఎమ్మెల్యే శంకరన్న మంచి మనసున్న నాయకుడని, ఇలాంటి నాయకుడు ఉండడం తమ అదృష్టమని వారు కొనియాడారు. దసరా పండుగ సందర్భంగా మా అందరికీ కానకలు అందజేసినా ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ అగ్గనూరు విశ్వం, సీనియర్ నేతలు కృష్ణారెడ్డి, అగ్గనూరు బస్వం, ఇబ్రహీం,మొహమ్మద్ ఇషాక్, కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Previous భవాని మాత అమ్మవారి పల్లకి సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next భగవాన్ దాస్ కాలనీ అమ్మవారి సన్నిధిలో మహా అన్నదాన కార్యక్రమం
ADVERTISEMENT