Posted on 2025-09-20 08:28:04
క్యాంప్ ఆఫీస్ ఏర్పాటుకు సన్నాహాలు..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: గత గురువారం డైలీ భారత్ న్యూస్ లో జిల్లాలో ఎమ్మెల్సీ టిపిసిసి క్యాంప్ ఆఫీస్ ఎక్కడ అనే శీర్షిక కు కాంగ్రెస్ పార్టీ వర్గాల నుండి ఎట్టకేలకు స్పందన లభించింది. ఎమ్మెల్సీ టీపీసీసీ చీఫ్ జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా డైలీ భారత్ లో ఇటీవల వచ్చిన కథనానికి స్పందించిన ఆయన తనకంటూ ఓ క్యాంపు కార్యాలయం జిల్లా కేంద్రంలో ఉండాలని ఉద్దేశంతో జిల్లా కేంద్రంలోని గంగస్థాన్ ఫేస్ వన్ లో స్వయంగా తానే వెళ్లి క్యాంప్ కార్యాలయం భవనం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా శ్రేణుల నుండి తెలిసింది. అయితే తనకంటూ ప్రత్యేక క్యాంపు కార్యాలయం అంటూ ఉంటే ప్రజా సమస్యలు నేరుగా తానే పరిష్కరించవచ్చు అనే ఉద్దేశంతో ఈ క్యాంప్ కార్యాలయం ఏర్పాట్లకు మహేష్ కుమార్ గౌడ్ సిద్ధమయ్యారు.
ఈ దసరా లోపు జిల్లాల్లో తనకంటూ క్యాంప్ కార్యాలయం ప్రారంభించనున్నట్లు ఆయన వర్గీయులు తెలిపారు.
ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్
Posted On 2026-08-30 17:15:04
Readmore >రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్
Posted On 2026-08-30 15:06:17
Readmore >బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం
Posted On 2026-08-30 14:01:50
Readmore >వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్
Posted On 2026-08-30 13:59:15
Readmore >