Posted on 2023-12-29 06:55:36
డైలీ భారత్, కరీంనగర్: అమ్మమ్మ ఊరి నుంచి ఇంటికి వచ్చేందుకు బస్సు ఎక్కిన బాలిక కరీంనగర్ బొమ్మకల్ బైపాస్ వద్ద బుధవారం అదృశ్యం కాగా శుక్రవారం సికింద్రాబాద్ లో ఉదయం ప్రత్యక్ష మయింది.
వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూర్ గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ కనుకుంట్ల నర్సింహంకు కనుకుంట్ల వశిస్ట క్రిష్ణ (13) అనే కుమార్తె ఉంది.పాఠశాలలకు రెండు రోజులు క్రిస్మస్ సెలవులు ఉండటంతో అమ్మమ్మ ఊరు పెద్దపల్లికి వెళ్ళింది.
సెలవులు పూర్తవ్వడంతో బుధవారం ఉదయం వశిస్ట తాతయ్య పెద్దపల్లిలో బస్సు ఎక్కించి కరీంనగర్ కు పంపాడు. తాతయ్య అమ్మాయి తండ్రికి బస్సు నెంబర్ మెసేజ్ చేశాడు.
కరీంనగర్ మంచిర్యాల చౌరస్తా స్టేజి దగ్గర తండ్రి అమ్మాయి కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలోనే బస్సు వచ్చింది కానీ అమ్మాయి బస్సులో నుంచి రాలేదు. కండక్టర్‌ను అడగగా అమ్మయి బైపాస్ లోనే దిగింది అని చెప్పాడు.
వెంటనే నర్సింహం బండి పై బైపాస్ దగ్గర వెళ్లి చూడగాఅమ్మాయి ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలిస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అమ్మాయి కోసం పోలీసులు అయిదు బృందాలుగా ఏర్పడి గాలించగా శుక్రవారం సికింద్రాబాద్ లో ప్రత్యక్షం అయింది.
అయోమయంలో ఒక చోట దిగవలసింది మరోచోట దిగడం ఫ్రీ బస్ ప్రయాణం కావడంతో తోచిన వైపు బస్ ఎక్కి ప్రయాణం చేసి ఉండవచ్చాని తెలిస్తోంది. సరదాగా ప్రయాణం చేసిందా?మరేమైన కారణాలు ఉన్నాయా?అన్నది తెలవలసి ఉంది
రాజ్‌భవన్‌లో స్వాతంత్ర్య వేడుకలకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడికి అరుదైన ఆహ్వానం
Posted On 2026-08-15 18:03:53
Readmore >
16 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న KRK Sunshine Charitable Trust
Posted On 2026-08-15 17:50:48
Readmore >
గ్రామీణ విద్యలో మార్పు... సాంకేత్ సంస్థ ద్వారా సోమారం స్కూల్‌కు డిజిటల్ పరికరాలు
Posted On 2026-08-15 17:49:14
Readmore >
విద్యుత్ షాక్ తో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు
Posted On 2026-08-15 16:55:47
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 13:43:20
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 07:51:52
Readmore >