| Daily భారత్
Logo




అరవింద్ ఖబర్దార్

News

Posted on 2025-09-14 22:23:44

Share: Share


అరవింద్ ఖబర్దార్

తప్పుడు మాటలతో ప్రజలను ఇంకెంతకాలం మభ్య పెడతావు

కాంగ్రెస్ పార్టీపై తప్పుడు మాటలు మాట్లాడితే  గ్రామగ్రామాన నిన్ను తరిమి కొడతాం

--- జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:వేల్పూర్ మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నర్సారెడ్డి తో కలిసి ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎంపీ అరవింద్,స్థానిక శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి అబద్ధపు మాటలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అందులో మొదటగా స్థానిక పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ఇటీవల బోధన్ లో జరిగిన సంఘటన ఉగ్రవాది అక్కడ కనిపిస్తే కాంగ్రెస్ పార్టీకి దానికి ముడి వేయడం జరిగిందని ఇది అరవింద్ పిచ్చి పట్టిన స్థితికి కారణమని, మొదటిసారి గెలిచిన అరవింద్ ఏదో పిచ్చోడిలా మాట్లాడిథె రెండోసారి గెలిచిన తర్వాత నిశ్శబ్దంగా ఉన్నాడు అనుకుంటే అప్పుడప్పుడు వాతావరణం లో వస్తున్న మార్పులాగా అప్పుడప్పుడు జిల్లాకు వచ్చి సంబంధం లేకుండా ఏదో మాట్లాడాలి అని రీతిలో పిచ్చికూతలు కూస్తూ దేశంలో ఎక్కడ ఏం జరిగినా కాంగ్రెస్ పార్టీకి ముస్లింలకు ఎంఐఎం కు ముడి వేయడం ఆయన అవివేకానికి నిదర్శనమని ఆయన అన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ దాడులకు సిద్ధంగా ఉంటే ఇప్పటికే బీజేపీ నాయకుల పై ఎన్నో దాడులు జరిగేవి అని, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధికారంలోకి వచ్చిన రోజే చట్టం విషయంలో ఎవరి పని వారు చేయాలని ఎవరి పై దాడికి పాల్పడకూడదని చెప్పడం జరిగిందని అందుకే కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర అభివృద్ధి పైన తప్ప బిజెపి టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న కుతంత్రాలపై ఆలోచించడం లేదు అని ఆయన అన్నారు. మరో పక్క స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి యూరియా కొరతపై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా సరఫరా చేయడంలో విఫలమైందని చెప్పడం తీవ్రంగా ఖండిస్తున్నామని ఎందుకంటే 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన ప్రశాంత్ రెడ్డి యూరియా కేంద్రం నుండి సరఫరా అవుతుందని తెలిసి కూడా కేంద్రం నుంచి బిజెపి తెలంగాణ రాష్ట్రానికి యూరియా సరఫరా తక్కువ చేసిందని మాట్లాడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా అందించడం లేదని చెప్పడం బిజెపికి మద్దతు తెలపడం లాంటిదే అని మానాల మోహన్ రెడ్డి అన్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి యూరియా వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్ మార్కెట్లో దానిని విక్రయిస్తే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంగా పరిగణించాలని అంతేకానీ కేంద్రం నుంచి యూరియా రాకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పై నిందలు వేయడం ప్రశాంత్ రెడ్డి బిజెపికి వత్తాసు పలకడమే అని ఆయన అన్నారు. ఒకపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీలో ఉంటూ రాష్ట్రానికి యూరియా పంపించాలని కేంద్ర మంత్రులను కలుస్తున్నారని ఆయన కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వివక్ష చూపుతూ తెలంగాణకు యూరియాను తక్కువ సరఫరా చేస్తూ ,పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ పంపుతున్నారని దీనిపై కేంద్రంపై కొట్లాడాలని, రాష్ట్రంలో ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు దద్దమ్మల్లాగా చూస్తున్నారు తప్ప రాష్ట్రానికి యూరియాను తీసుకు రావడం లేదు అని దుయ్య. కేటీఆర్ మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరియాను సరఫరం చేయడంలో విఫలం అయ్యాయని మేము ఓటు వేయడం లేదని కల్లబొల్లి మాటలు చెప్పి తప్పించుకున్నాడని, కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి మేము మీ ఓటు వేయాలంటే మా రాష్ట్రానికి యూరియా పంపించాలని డిమాండ్ చేయలేదని ఇది కేవలం బిజెపికి పరోక్షంగా మద్దతు తెలపడానికి చేసిన కుట్ర అని, మరొకసారి యూరియా కొరతపై కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే టిఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీస్తామని ఆయన అన్నారు. అదేవిధంగా స్థానిక ఎంపీ అరవింద్ వాస్తవాలకు భిన్నంగా కేవలం మతపరమైన విభేదాలు సృష్టిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పై అడ్డగోలు విమర్శలు చేస్తే గ్రామ గ్రామాన మిమ్మల్ని మీ బిజెపి నాయకులను తరిమి కొడతామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోపాల్గొన్న తెలంగాణ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ మానాల మోహన్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ కుంట రమేష్ రెడ్డి, మండల అధ్యక్షులు  గడ్డం నర్సారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లేష్,జిల్లా జనరల్ సెక్రెటరీ దామోదర్ గౌడ్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరేందర్, బీసీ మండల ప్రెసిడెంట్ రమణ, కిషన్ సెల్ మండల ప్రెసిడెంట్ రవి, భగవాన్ దాస్, సోషల్ మీడియా మండల ప్రెసిడెంట్ మహేందర్,  కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

Image 1

హుస్నాబాద్‌లో అబ్బురపరిచే గాజు వంతెన !

Posted On 2026-04-29 08:29:53

Readmore >
Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >
Image 1

విలువలు కూలిపోతున్న నాలుగవ స్తంభం...?

Posted On 2026-04-28 22:47:26

Readmore >
Image 1

మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ

Posted On 2026-04-28 22:34:17

Readmore >
Image 1

నాలుగో స్థంభానికీ తప్పని అవమానాలు..

Posted On 2026-04-28 22:32:22

Readmore >
Image 1

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్

Posted On 2026-04-28 19:43:12

Readmore >
Image 1

జిల్లా పంచాయతీ అధికారి పై ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-04-28 10:12:26

Readmore >
Image 1

హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు శిక్ష

Posted On 2026-04-28 09:48:57

Readmore >
Image 1

బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!

Posted On 2026-04-28 07:58:08

Readmore >