Posted on 2025-09-14 16:23:15
నగరంలో స్వర్గీయ సీనియర్ జర్నలిస్ట్ అంజాగౌడ్ 7వ వర్ధంతి సందర్భంగా స్నేహ సొసైటీలో దివ్యాంగ విద్యార్థులకు అన్నదానం కార్యక్రమం
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్:సీనియర్ జర్నలిస్టు అంజాగౌడ్ 7వ వర్ధంతి సందర్భంగా ఆదివారం నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని స్నేహ సొసైటీలో మానసిక వికలాంగుల విద్యార్థులకు అన్నదానం, బిస్కెట్లు, సమోసాలు పంపిణీ చేశారు. అలాగే నగరంలోని బైపాస్ రోడ్డు, రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో నిరాశ్రయులకు అన్నదానం నిర్వహించారు.ఈ సందర్బంగా స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య మాట్లాడుతూ అంజా గౌడ్ వర్ధంతి సందర్బంగా వికలాంగుల పిల్లలకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమన్నారు. జర్నలిస్ట్ గా సమాజం లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పత్రికల్లో రాసి అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కారం చేసేవారన్నారు. పత్రికల ద్వారా సమస్యలను వెలికితీసి ప్రజలకు, అధికారులకు, నాయకులకు మధ్య వారధిగా ఉండేవారన్నారు. అంజాగాడ్ కుమారుడు కిషోర్ గౌడ్ మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా మా తండ్రి వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంజా గౌడ్ కుటుంబ సభ్యులు కిషోర్ గౌడ్, కిరణ్ గౌడ్, నరేంద్ర గౌడ్, బింగి శుభం, సిద్దు పవర్, రమేష్, సతీష్, లవన్ కుమార్,రాహుల్ తేజ, తదితరులు పాల్గొన్నారు.
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >
జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి
Posted On 2026-08-28 14:19:41
Readmore >
ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా
Posted On 2026-08-28 14:18:02
Readmore >