| Daily భారత్
Logo




గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ దుస్తులు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే

News

Posted on 2025-09-14 17:30:18

Share: Share


గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ దుస్తులు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలోని కంటేశ్వర్ బైపాస్ లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గిరిజన ఆశ్రమ పాఠశాల సిరికొండ విద్యార్థులకు నిజామాబాద్ రూరల్ యూత్ నాయకులు ఉమ్మాజి నరేష్ ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి స్పోర్ట్స్ దుస్తులను విద్యార్థులకు వితరణ చేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ విద్యార్థులకు అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్మోటిక్ చార్జీలు పెంచామని అన్నారు. మరియు నాణ్యమైన విద్యతోపాటు, నాణ్యమైన ఆహారం పెడుతున్నామని, ముఖ్యంగా శారీరక దృఢత్వం ఉండడానికి స్పోర్ట్స్, గేమ్సలో ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్రస్థాయి నేషనల్ స్థాయిలో ఆటలు ఆడి రాష్ట్రానికి, జిల్లాకు, గిరిజన పాఠశాలకు, నిజామాబాద్ రూరల్ నియోజవర్గానికి పేరు తేవాలని అన్నారు. సిరికొండ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు వివిధ స్పోర్ట్స్ మరియు గేమ్స్ రాష్ట్ర స్థాయి వరకు వెళ్లారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులు గోపి, గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు భోజరాం, ఫిజికల్ డైరెక్టర్ ప్రశాంత్, ఉపాధ్యాయులు సంజీవ్, ఫీల్డ్ అసిస్టెంట్ గణేష్, రాజేశ్వర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >
Image 1

దివ్యాంగుల నావకు తెరచాప మందకృష్ణ మాదిగ

Posted On 2026-08-28 14:21:39

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి

Posted On 2026-08-28 14:19:41

Readmore >
Image 1

ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా

Posted On 2026-08-28 14:18:02

Readmore >
Image 1

హిమగిరి కన్నీరు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-28 08:11:08

Readmore >