Posted on 2025-09-14 15:33:49
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని అమ్మ వెంచర్స్‌లో నిర్మాణం జరుగుతున్న శ్రీ వారాహి మాత దేవాలయం భక్తులకు ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఈ ఆలయంలో ప్రతిష్టించబోయే పంచలోహ విగ్రహంకు కర్ణాటకలోని శృంగేరి శారదా పీఠంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ పూజా మహోత్సవం జగద్గురు శృంగేరి శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ భారతి తీర్థ మహాస్వామి వారి దివ్య సన్నిధానంలో, అలాగే జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారి ఆశీస్సులతో పవిత్రంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ పాల్గొని దైవ కృపను పొందారు. ఆలయ నిర్మాణం సమయానికి పూర్తి అవ్వాలని, ఈ క్షేత్రం భక్తుల ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రబిందువుగా నిలవాలని స్వాములు ఆశీర్వదించారు. నిజామాబాద్ నేలపై ఆవిష్కృతమవుతున్న ఈ వారాహి మాత ఆలయం, భవిష్యత్తులో భక్తులకు దివ్య దర్శన క్షేత్రంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ పూజా మహోత్సవంలో మంచాల జ్ఞానేందర్ గుప్త తో పాటు మరుమాముల వెంకట రమణ శర్మ, శాస్త్రుల వెంకటేశ్వర శర్మ, పురాణం మహేశ్వర శర్మ, వేగేటి పశుపతినాథ శర్మ, తుంద్ల కమలాకర శర్మ తదితరులు పాల్గొన్నారు.
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >
జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి
Posted On 2026-08-28 14:19:41
Readmore >
ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా
Posted On 2026-08-28 14:18:02
Readmore >