Posted on 2025-09-14 14:20:13
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లో రోడ్డుపై చెత్త వేయడం సర్వసాధార ణమే కదా! అని తేలికగా తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త. ఇకపై అలా చేస్తే జరిమానాతో సరిపోదు, ఏకంగా 8 రోజుల పాటు.. జైలు శిక్ష అనుభవించవలసిందే నగరంలో రోడ్లపై చెత్త వేసే వారిపై హైదరాబాద్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు సంయుక్తంగా కొరడా ఝుళిపిస్తున్నారు.
ఈ నిర్లక్ష్యం కేవలం అపరిశుభ్రతకే కాకుండా, కొన్నిచోట్ల సామాజిక ఉద్రిక్తతలకు కూడా దారితీస్తుండటంతో అధికారులు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. నగరవాసులు రోడ్ల పక్కన పడేస్తున్న చెత్త, ముఖ్యంగా మాంసాహార వ్యర్థాలను వీధికుక్కలు, పిల్లులు వంటి జంతువులు లాక్కెళ్లి సమీపంలోని దేవాలయా లు, మసీదులు, చర్చిలు, ఇళ్ల ముందు పడేస్తున్నాయి.
ఈ కారణంగా సున్నితమైన ప్రాంతాల్లో వివాదాలు తలెత్తి, స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. ఇటీవల ఇలాంటి ఘటనలు పెరిగిపోవడంతో, ఈ సమ స్యకు మూలకారణమైన రోడ్లపై చెత్త వేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవా లని పోలీసులు నిర్ణయించారు.
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >
జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి
Posted On 2026-08-28 14:19:41
Readmore >
ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా
Posted On 2026-08-28 14:18:02
Readmore >