| Daily భారత్
Logo




జాతీయ లోక్ అదాలత్ కు జిల్లాకు నాలుగవ స్థానం

News

Posted on 2025-09-14 13:27:01

Share: Share


జాతీయ లోక్ అదాలత్ కు జిల్లాకు నాలుగవ స్థానం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెండింగ్ లో ఉన్న కేసులను రాజీ పద్ధతిలో పరిష్కరించినందుకు నిజామాబాద్ జిల్లాకు 4వ స్థానం వచ్చిందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు.. ఇందుకు కృషి చేసిన అధికారులకు సిబ్బందికి సీపీ సాయి చైతన్య అభినందనలు తెలిపారు. గత నెల రోజుల నుండి శనివారం జరిగిన జాతీయ మెగా లోక్-అదాలత్ వరకు కేసులలో భాగంగా, జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన, రాజీ పడటానికి అవకాశం ఉన్న చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కేసులు రాజీ పద్ధతిలో పరిష్కరించబడ్డాయన్నారు. ఐ.పి.సి, బి ఎన్ ఎస్ 501 కేసులు, సైబర్ క్రైమ్ 138 కేసులు, ఇ -పెట్టి 1958 కేసులు డి.డి, ఎంవీ యాక్ట్ 4985 కేసులతో కలిపిమొత్తం 7444 కేసులలో ఇరు వర్గాలను రాజీ కుదర్చడం జరిగిందని, ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు. జాతీయ మెగా లోక్- అదాలత్ లో భాగంగా నిజామాబాద్ జిల్లా కు సైబర్ క్రైమ్, వివిధ కేసులలో రాజీ మార్గం చేసినందుకు నిజామాబాద్ జిల్లాకు 4వ స్థానం రావడం జరిగిందన్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులకు 42.45.273-00 రూపాయలను ఇప్పించడం జరిగిందన్నారు. జిల్లాను రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా ఉంచడంలో కృషి చేసిన అధికారులు, సైబర్ క్రైమ్ సిబ్బందిని, కోర్టు సిబ్బందిని జిల్లా పోలీస్ కమీషనర్ అభినందించారు. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక మంచి అవకాశం అని, అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని అన్నారు. రాజీ మార్గమే రాజా మార్గం అని, రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులల్లో ఇరు వర్గాలు రాజీపడవచ్చు అన్నారు. ముఖ్యంగా సైబర్ బాధితులకు సత్వర న్యాయం చేయాలని, తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ ఆద్వర్యంలో 7 కమీషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లు, ప్రతి జిల్లాలో డి4సి ని ఏర్పాటు చేసి డి.ఎస్.పి స్థాయి అధికారులచే పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. నిజామాబాద్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన సైబర్ నేరాలలో ఈ జాతీయ మెగా లోక్-అదాలత్ లో 138 సైబర్ క్రైమ్ కేసులలో 42,45,273-00 రూపాయలను తిరిగి సైబర్ బాధితులకు ఇప్పించేందుకు ఆర్డర్ కాపీలను సంబంధిత బ్యాంక్ నోడల్ అధికారులకు పంపించడం జరిగిందన్నారు.

జిల్లా ప్రజలెవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే దరఖాస్తు చేయవచ్చు అన్నారు. ఈ సందర్భంగా జాతీయ మెగా లోక్- అదాలత్ ను విజయవంతం చేసిన అధికారులు సైబర్ క్రైమ్ ఏసీపీ వెబోఫ్ట్వేర్ రావ్, సీఐ ముఖిద్ పాషా, సి సి ఆర్ బి సీఐ సతీష్ సైబర్ సెల్ సిబ్బందిని పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, అభినందించారు.

Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >
Image 1

దివ్యాంగుల నావకు తెరచాప మందకృష్ణ మాదిగ

Posted On 2026-08-28 14:21:39

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి

Posted On 2026-08-28 14:19:41

Readmore >
Image 1

ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా

Posted On 2026-08-28 14:18:02

Readmore >
Image 1

హిమగిరి కన్నీరు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-28 08:11:08

Readmore >