| Daily భారత్
Logo




మూడేళ్ల బాలుడిని హత్య చేసిన తండ్రి

News

Posted on 2025-09-14 06:46:05

Share: Share


మూడేళ్ల బాలుడిని హత్య చేసిన తండ్రి

డైలీ భారత్, హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతున్న తన మూడేళ్ల చిన్న కుమారుడిని ఓ తండ్రి దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బండ్లగూడ నూరినగర్‌కు చెందిన మహ్మద్ అక్బర్ (35), ఆయన భార్య సనాబేగం దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడు అనాస్ (3) గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ కారణంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.

ఈ నేపథ్యంలో తన కుమారుడిని హత్య చేయాలని అక్బర్ ప్లాన్ చేశాడు. శుక్రవారం రాత్రి, భార్య విధులకు వెళ్లిన సమయంలో, దిండుతో చిన్నారిని ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం బాలుడి మృతదేహాన్ని సంచిలో మూటకట్టి, మూసీ నదిలో పడేశాడు. బాలుడు కనిపించడం లేదని మొదటిగా ఎవరికీ అనుమానం రాకుండా నటించాడు. తరువాత, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అయితే, తండ్రిని గమనించిన పోలీసులు, అతడిపై అనుమానంతో గట్టిగా ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. చివరకు తానే కుమారుడిని హత్య చేసినట్లు తండ్రి అంగీకరించాడు. ఈ ఘటన స్థానికులను కలచివేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు మహ్మద్ అక్బర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలుడి మృతదేహం కోసం రక్షణ బలగాలు మూసీలో గాలింపు చర్యలు చేపట్టాయి

Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >
Image 1

దివ్యాంగుల నావకు తెరచాప మందకృష్ణ మాదిగ

Posted On 2026-08-28 14:21:39

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి

Posted On 2026-08-28 14:19:41

Readmore >
Image 1

ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా

Posted On 2026-08-28 14:18:02

Readmore >
Image 1

హిమగిరి కన్నీరు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-28 08:11:08

Readmore >