| Daily భారత్
Logo




మరో వివాదంలో చిక్కిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

News

Posted on 2025-09-14 09:48:40

Share: Share


మరో వివాదంలో చిక్కిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

నిబంధనలు విరుద్ధంగా రెండు చోట్ల గన్ లైసెన్స్ తీసుకున్న మాజీ ఎమ్మెల్యే

సంఘటనపై పోలీసుల లోతైన విచారణ

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి చుట్టూ ఇప్పుడు మరో వివాదం అలుముకుంది. ఆయన మాబాద్ పోలీసులు సీజ్ చేయడంతో మొదలైన ఈ వ్యవహారం, ఇప్పుడు పోలీసు అధికారుల సంఘం హెచ్చరికలతో మరింత ముదిరింది. గతంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న జీవన్ రెడ్డి, ఇప్పుడు పోలీసుల పైనే వ్యక్తిగత దూషణలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే తన గన్ లైసెన్స్ రెన్యువల్ కోసం నిజామాబాద్ కమిషనరేట్ కు వెళ్లారు. అయితే, అక్కడ పోలీసులు జీవన్ రెడ్డికి ఒకేసారి రెండు బ్యోగస్ లైసెన్సులు ఉన్నట్లు గుర్తించారు. నిబంధనల  ప్రకారం ఒక వ్యక్తికి ఒకే చోట గన్ లైసెన్స్ ఉండాలి కానీ ఇందుకు విరుద్ధంగా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఒక లైసెన్స్  సైబరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో మరొకటి నిజామాబాద్ పరిధిలో ఉన్నట్లు తేలింది. దీంతో

సీపీ సాయి చైతన్య వెంటనే జీవన్ రెడ్డి గన్ స్వాధీనం చేసుకుని, నోటీసులు జారీ చేశారు. 2016 నుంచే ఆయన లైసెన్సులు కలిగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వ్యక్తిగత దూషణలు, గన్ సీజ్ చేయడం ప్రభుత్వం ఆయనకు సెక్యూరిటీని కూడా తొలగించవంతో జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా సీపీపై వ్యక్తిగత ఆరోపణ లకు దిగారు. ఈ చర్య పోలీసు అధికారులు సంఘాన్ని కలవరపరిచింది. పోలీసుల సంఘం విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. తప్పులన్నీ ఆయన చేసి పోలీసులపై అనవసర ఆరోపణలు చేస్తున్నరు. పింక్ బుక్లో పేర్లు రాస్తున్నామంటూ బెదిరింపులకు పాల్పడటం చూసుకోవాలి. మళ్లీ పోలీసులపై వ్యక్తిగత రూపణలు చేస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటాం. రూల్స్ అతిక్రమిస్తే ఎవరైనా చట్టానికి అతీతులు కారు అని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ సంఘటనలో జీవన్ రెడ్డి వర్సెస్ పోలీసుల మధ్య నెలకొన్న వివాదం మరింత తీవ్రమైంది. ఇది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.

Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >
Image 1

దివ్యాంగుల నావకు తెరచాప మందకృష్ణ మాదిగ

Posted On 2026-08-28 14:21:39

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి

Posted On 2026-08-28 14:19:41

Readmore >
Image 1

ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా

Posted On 2026-08-28 14:18:02

Readmore >
Image 1

హిమగిరి కన్నీరు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-28 08:11:08

Readmore >