Posted on 2025-09-13 16:35:41
స్థానిక ఎన్నికలలో బీజేపీ టికెట్ కోసం అన్ని పార్టీల నాయకులు క్యూ కట్టేందుకు సిద్ధమవుతున్నారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బిజెపి జెండా ఎగరవేస్తాం : నిజామాబాద్ ఎంపీ అర్వింద్
నిజామాబాద్ ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బీజేపీ జిల్లా కార్యాలయంలో శనివారం జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అధ్యకతన సేవా పక్షం జిల్లా కార్యాశాల ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి మాట్లాడుతూ...
జిల్లాలో స్థానిక సంస్థలన్నీ బీజేపీ కైవసం చేసుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అన్ని పార్టీల నాయకులు బీజేపీ టికెట్ కోసం క్యూ కడుతున్నారని, గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గెలువదు అని స్వయంగా ఫోన్స్ చేస్తున్నారు కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి లేదు మాకు బీజేపీ టికెట్ ఇవ్వండి అని మోర పెట్టుకుంటున్నారు జిల్లాలో అన్ని స్థానాల్లో బీజేపీ కైవసం చేసుకుంటుంది కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి సముచిత న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు ప్రతి రంగంలో బీజేపీ ప్రభుత్వమే కృషి చేస్తోంది. తెలంగాణలో కూడా అదే విధంగా బీజేపీ జెండా ఎగరబోతుంది” అని తెలిపారు. సేవా పక్షం లో భాగంగా ప్రతి బూత్ స్థాయిలో కార్యక్రమాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అని అన్నారు.కార్యక్రమంలో పసుపు బోర్డు చేర్మెన్ పల్లె గంగారెడ్డి రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డి,జిల్లా ప్రదాన కార్యదర్శి నాగోళ్ళ లక్ష్మి నారాయణ, న్యాలం రాజు, ఉపాధ్యక్షలు రాంచందర్, పాలేపు రాజు, నర్సారెడ్డి,జిల్లా, నగర, మండల స్థాయి నాయకులు, పాల్గొన్నారు.
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >
జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి
Posted On 2026-08-28 14:19:41
Readmore >
ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా
Posted On 2026-08-28 14:18:02
Readmore >