Posted on 2025-09-13 13:58:41
మూడవ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ ధర్మపురి అరవింద్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: సమాజంలో విద్య వైద్య రంగాలకు జోస్ ఆలుక్కాస్ సంస్థ చేస్తున్న సేవ కార్యక్రమాలు అద్భుతమని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి కొనియాడారు. శనివారం జోస్ ఆలుక్కాస్ *జువెలరీ షోరూం* మూడవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా జిల్లాలోని ప్రాధాన్యతా రంగాలైన ఆసుపత్రులకు, పాఠశాలకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూరుస్తున్నారని కొనియాడారు. ప్రస్తుతం మూడో వార్షికోత్సవ పురస్కరించుకొని చేపడుతున్న కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నిలవడం గర్వకారణం అన్నారు. నాలుగు ప్రభుత్వ పాఠశాలకు సుమారు రూ.6 .96 లక్షల విలువగల కంప్యూటర్ లు, డిజిటల్ టీవీ, తాగునీటి శుద్ధి యంత్రం లాంటి మౌలిక సదుపాయాలు కల్పనకు నిధులు *వెచ్చించడం* హర్షణీయం అన్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. బంగారు, *వజ్రాభరణాల* వ్యాపారంలో నమ్మకమైన సంస్థగా ప్రఖ్యాతి *గడించిన* జోస్ ఆలుక్కాస్ *జువెలరీ షోరూం* వ్యాపారం లో అభివృద్ధి చెంది సమాజసేవలను విస్తరించాలని కోరారు. ప్రతి ఒక్కరు సంస్థ చేస్తున్న సేవలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సమాజసేవలో వివిధ రంగాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మూడో వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 13 నుంచి 19 వరకు ప్రత్యేక ఆఫర్లు అందజేస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రతి రూ. 75 వేల విలువగల బంగారు ఆభరణాలు కొనుగోలు పై ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. అనంతరం వివిధ పాఠశాలకు ఎంపీ చేతుల మీదుగా సి ఎస్ ఆర్ ఫండ్ చెక్కులను అందజేశారు. కేక్ కట్ చేసి మూడో వార్షికోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ దనిష్ , అసిస్టెంట్ మేనేజర్ సజయ్, అకౌంట్స్ మేనేజర్ జితిన్, పి ఆర్ ఓ పిప్పెర నరేందర్, తదితర సిబ్బంది, ప్రతినిధులు పాల్గొన్నారు.
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >
జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి
Posted On 2026-08-28 14:19:41
Readmore >
ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా
Posted On 2026-08-28 14:18:02
Readmore >