Posted on 2025-09-13 10:49:05
డైలీ భారత్, నెల్లూరు: నెల్లూరులో అమానుష ఘటన చోటుచేసుకుంది. కరెంట్ ఆఫీసు సెంటర్ వద్ద బీఫార్మసీ విద్యార్థిని మైధిలి ప్రియ దారుణ హత్యకు గురైంది. ఇటీవల బీఫార్మసీ ఫైనల్ ఇయర్ పూర్తిచేసింది మైధిలిప్రియ. ఆమెతో మాట్లాడాలని రూమ్‌కి పిలిచి, కత్తితో పొడిచి చంపేశాడు స్నేహితుడు నిఖిల్
అయితే, మైధిలిప్రియ ప్రేమకు నిరాకరించినందుకే నిందితుడు హతమార్చి ఉంటాడని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. యువతిని హత్యచేసిన అనంతరం పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు నిందితుడు నిఖిల్. మైధిలిప్రియ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు జీజీహెచ్‌కి తరలించారు పోలీసులు. మైధిలిప్రియ మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిందితుడు నిఖిల్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >
జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి
Posted On 2026-08-28 14:19:41
Readmore >
ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా
Posted On 2026-08-28 14:18:02
Readmore >