Posted on 2025-09-08 11:07:56
ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలు..
ముఖ్యఅతిథిగా హాజరైన అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త
డైలీ భారత్, నిజామాబాద్: శాస్త్ర చికిత్సలతో న్యాయం కానీ వ్యాధులు నేటి కాలంలో ఫిజియోథెరపీ వైద్యంతో శాశ్వతంగా దూరం కావచ్చని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘంలో నిజామాబాద్ ఫిజియోథెరపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శస్త్ర చికిత్సల ద్వారా నయం కానీ వ్యాధులు ఫిజియోథెరపీ చేయడం వల్ల నయమవుతున్నాయన్నారు. ప్రపంచ ఫియోతెరపి డే సందర్భంగా నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా నుండి మున్నూరు కాపు సంఘం వరకు 2 కిలోమీటర్ల నడక చేపట్టారు.. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఫిజియోథెరపీ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జి. శివకుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి.ప్రమోద్ కుమార్, ఉపాధ్యక్షులు డాక్టర్ అశ్విని, కోశాధికారి డాక్టర్ కీర్తి గుప్తా, ప్రగతి, తిరుమల ఫిజియోథెరపీ కాలేజీల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వంశీకృష్ణ, డాక్టర్ కళ్యాణ్, నిజామాబాద్ ఫిజియోథెరపీ అసోసియేషన్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >
జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి
Posted On 2026-08-28 14:19:41
Readmore >
ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా
Posted On 2026-08-28 14:18:02
Readmore >