| Daily భారత్
Logo




ఏ ఐ బి ఎస్ ఎస్ ఆధ్వర్యంలో అదిలాబాద్ మాజీ ఎంపీ, భద్రాచలం ప్రస్తుత ఎమ్మెల్యేల దిష్టిబొమ్మ దగ్ధం

News

Posted on 2025-09-08 11:06:24

Share: Share


ఏ ఐ బి ఎస్ ఎస్  ఆధ్వర్యంలో అదిలాబాద్ మాజీ ఎంపీ, భద్రాచలం ప్రస్తుత ఎమ్మెల్యేల దిష్టిబొమ్మ దగ్ధం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: అదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాబురావు, భద్రాచలం తాజా ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు లు లంబాడీల హక్కులను కాలరాసేందుకు కుట్రలు పన్నుతున్నారని అందుకే హైకోర్టు, సుప్రీంకోర్టులో ఎస్సీ జాబితాల నుండి లంబాడీల రిజర్వేషన్ను తొలగించాలని పిటీషన్ వేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం. చౌహాన్ బాబు రామ్ నాయక్ ఆరోపించారు. ఇందుకు నిరసనగా జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో ఆ ఇద్దరి దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లంబాడీలను ఎస్సీ జాబితాలో ఉంచాలని రాజ్యాంగం కల్పించిన తమ హక్కులను కాలరాసేందుకు వారు కుట్రలు పన్ని  తమ రిజర్వేషన్లను దక్కకుండా చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే వారిరువురూ తమ లంబాడి జాత్రికి క్షమాపణ చెప్పి వారు వేసిన పిటిషన్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే తమ ఆందోళన మరింత ఉధృతం రాష్ట్రవ్యాప్తంగా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, కొర్ర గంగాధర్ నాయక్, నాయకులు జాదవ్ ప్రవీణ్, శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >
Image 1

దివ్యాంగుల నావకు తెరచాప మందకృష్ణ మాదిగ

Posted On 2026-08-28 14:21:39

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి

Posted On 2026-08-28 14:19:41

Readmore >
Image 1

ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా

Posted On 2026-08-28 14:18:02

Readmore >
Image 1

హిమగిరి కన్నీరు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-28 08:11:08

Readmore >