| Daily భారత్
Logo




భక్తి శ్రద్ధలతో గోవింద నామస్మరణతో ముగిసిన జెండా బాలాజీ జాతర ఉత్సవాలు

News

Posted on 2025-09-07 09:50:37

Share: Share


భక్తి శ్రద్ధలతో గోవింద నామస్మరణతో ముగిసిన జెండా బాలాజీ జాతర ఉత్సవాలు

ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, టిపిసిసి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ప్రతి సంవత్సరం జిల్లా కేంద్రంలోని జండా బాలాజీ ఆలయ జాతర ఉత్సవాలు ఆదివారం తో ఆధ్యాత్మిక వాతావరణంలో ముగిశాయి. భక్తి శ్రద్ధలతో భక్తులు నగరపుర వీధుల గుండా శ్రీ వెంకటేశ్వర బాలాజీ నామ స్మరణతో   జెండాను ఊరేగించి పూలాంగ్ సమీపంలో ప్రతిష్టించారు. గత 15 రోజులుగా నగరంలోని  బాలజీ ఆలయంలో కొనసాగిన జాతర ఆదివారంతో ముగిసింది. వంశపారపర్యం అర్చకులు అజయ్ సంగ్వాయి, సంజయ్ సంగ్వాయి, విజయ్ సాంగ్వాయ్ నేతృత్వంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే పౌర్ణమి రోజు సాయంత్రం జెండాతో పాటు ఉత్సవమూర్తులను శోభాయాత్ర పూలాంగ్ సమీపంలోకి తరలించడం ఆనవాయితీ.  ఈసారి చంద్రగ్రహణం ఉండడంతో ఉదయాన్నే జెండాను ఊరేగించారు. ఆలయం నుంచి సిర్నాపల్లి గడి గోల్ హనుమాన్ మీదుగా పూలాంగ్ బ్రిడ్జి సమీపంలో ప్రతిష్ఠించారు. ఆదివారం పౌర్ణమి కావడంతో దర్శనానికి అనుమతి లేదని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా, ఆలయ చైర్మన్ ప్రమోద్, ఈవో వేణు పాల్గొన్నారు.  ఇది ఇలాఉండగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జెండా జాతర లో పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, జెండాను దర్శించుకున్నారు. సంప్రదాయంగా వస్తున్న జాతరలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం ఆలయ పండితులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.

Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >
Image 1

దివ్యాంగుల నావకు తెరచాప మందకృష్ణ మాదిగ

Posted On 2026-08-28 14:21:39

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి

Posted On 2026-08-28 14:19:41

Readmore >
Image 1

ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా

Posted On 2026-08-28 14:18:02

Readmore >
Image 1

హిమగిరి కన్నీరు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-28 08:11:08

Readmore >