| Daily భారత్
Logo




హైదరాబాద్‏లోని ఆర్జీవీ ఆఫీస్ వద్ద వర్మ దిష్టిబొమ్మ దగ్ధం

News

Posted on 2023-12-26 10:30:42

Share: Share


హైదరాబాద్‏లోని ఆర్జీవీ ఆఫీస్ వద్ద వర్మ దిష్టిబొమ్మ దగ్ధం

డైలీ భారత్, హైదరాబాద్:ఫిలింనగర్‏లో టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు నిన్న రాత్రి ఆందోళనకు దిగారు.

ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వర్మ. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన వ్యూహం సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వ్యూహం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదలను ఆపాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. థియేటర్లతోపాటు, ఓటీటీల్లోనూ సినిమా రిలీజ్ చేయొద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వ్యూహం రిలీజ్ డేట్ మార్చారు వర్మ. ఈ చిత్రాన్ని ఈనెల 27న కాకుండా.. డిసెంబర్ 29న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు వర్మ.

ఈ క్రమంలోనే నిన్న ఆర్జీవీ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు టీడీపీ కార్యకర్తలు.అదే సమయంలో రామ్ గోపాల్ వర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడే వర్మ దిష్టి బొమ్మను సైతం దగ్ధం చేశారు. వ్యూహం సినిమాను రిలీజ్ చేయొద్దంటూ టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై వర్మ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు రాగానే టీడీపీ కార్యకర్తలు వెళ్లిపోయారని ట్వీట్ చేశారు ఆర్జీవీ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

ఈ ఘటనపై నిర్మాత దాసరి కిరణ్ మాట్లాడుతూ.. సినిమాను సినిమాగానే చూడాలని అన్నారు. ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డు సర్టిఫై చేసిన తర్వాత కూడా టీడీపీ కార్యకర్తలు ఇలా దాడులు చేయడం సరికాదని తెలిపారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2009 నుంచి 2019 వరకు జరిగిన రాజకీయ పరిస్థితులపై వర్మ వ్యూహం సినిమాను తెరకెక్కించారు. రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >
Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >
Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >
Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >