Posted on 2023-12-25 12:40:24
డైలీ భారత్, నాగర్‌కర్నూల్:నాగర్ కర్నూల్ పట్టణంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఎలుక కారణంగా 40 రోజుల పసికందు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
పట్టణంలోని నాగనూల్ ప్రాంతంలో నివసించే శివ, లక్ష్మికళ దంపతులకు 40 రోజుల క్రితం మగ శిశువు జన్మించాడు. శనివారం డిసెంబర్ 23 ఆర్డ రాత్రి నేలపై తల్లితో నిద్రిస్తున్న చిన్నారి ముక్కును ఎలుక కొరకింది. ఇది తల్లిదండ్రులు గమనించకపోవటంతో తీవ్ర రక్తస్రావమైంది.
శిశువు ఏడుపుతో నిద్రలేచిన తల్లిదండ్రులు చిన్నారిని వెంటనే పట్టణ ఆసుపత్రికి తరలించారు. తరువాత పరిస్థితి విషమంగా ఉండటంతో నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్సపొందుతూ ఆదివారం సాయంత్రం చిన్నారి మృతి చెందింది దీంతో కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. చిన్నారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించడం అక్కడున్నవారిచే కంటతడి పెట్టించింది.
ఎలుకల కారణంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు గతంలోనూ అనేకం చోటు చేసుకున్నాయి. చిన్నారులు ఉన్న చోట పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకో వాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎలుకలు, విషపురుగుల బారిన చిన్నారులు పడ కుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు....
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >