| Daily భారత్
Logo




ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

News

Posted on 2025-08-16 20:59:29

Share: Share


ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

శ్రీకృష్ణుని వేషాధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చిన్నారులు

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలోని మారుతి నగర్ లో గల మురళీకృష్ణ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలను రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్లు మురళీకృష్ణ ఆలయ అర్చకులు వెంకటేశ్వరశర్మ, ఆలయ ఛైర్మన్ రాములు 

తెలిపారు. శనివారం కృష్ణాష్టమి సందర్భంగా  తెల్లవారుజామున నుండి  స్వామివారికి  పంచామృతాభిషేకాలు, హారతులు ఇచ్చి భక్తులకు దర్శనం కల్పించడం జరిగిందన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని అన్నారు. అదేవిధంగా  ఆదివారం ఉదయం 9 గంటలకు స్వామివారి పల్లకీ సేవ, మధ్యాహ్నం ఒంటి గంటకు అన్న ప్రసాద వితరణ చేపట్టనున్నట్లు వారు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నగరంలోని ఆర్మూర్ రోడ్డు లో గల మురళీకృష్ణ ఆలయంతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు శ్రీకృష్ణ ఆలయాల్లో కృష్ణాష్టమి సందర్భంగా  భక్తులు ఉదయం నుంచే కృష్ణుడి ఆలయాలను సందర్శించి పూజలు చేస్తున్నారు. దీంతో కృష్ణుడి మందిరాలు కితకిత లాడాయి పలుచోట్ల చిన్నారులు శ్రీకృష్ణుని వేషాధారణతో ఆటల పోటీలు, ఉట్టి కొట్టే కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీకృష్ణుని వేషాధారణతో చిన్ని చిన్ని చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మరోవైపు ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-03-01 10:40:53

Readmore >
Image 1

రూ.5,456.26 కోట్లతో టీటీడీ 2026–27 బడ్జెట్ ఆమోదం

Posted On 2026-03-01 06:50:29

Readmore >
Image 1

సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్

Posted On 2026-02-28 21:44:48

Readmore >
Image 1

పాపకొల్లు గ్రామం : బుడియా బాపు జాతర కార్యక్రమం

Posted On 2026-02-28 21:39:40

Readmore >
Image 1

ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి

Posted On 2026-02-28 20:49:58

Readmore >
Image 1

యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు

Posted On 2026-02-28 20:10:03

Readmore >
Image 1

గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-02-28 19:39:47

Readmore >
Image 1

గ్రీన్ సెల్ఫీ పాయింట్ తో ఘనంగా సైన్స్ దినోత్సవ వేడుకలు

Posted On 2026-02-28 18:39:59

Readmore >
Image 1

రానున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బిజెపి శాసనసభా పక్ష సమావేశం

Posted On 2026-02-28 18:35:18

Readmore >
Image 1

ఆహార భద్రత చట్టం పకడ్బందీగా అమలు చేయాలి : రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

Posted On 2026-02-28 17:50:47

Readmore >