| Daily భారత్
Logo




పార్లమెంట్లో ఎంపీల బహిష్కరణను నిరసిస్తూ నిరసన

News

Posted on 2023-12-22 14:56:34

Share: Share


పార్లమెంట్లో ఎంపీల బహిష్కరణను నిరసిస్తూ నిరసన

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల ;శుక్రవారం పార్లమెంటులో ఎంపీల బహిష్కరణను నిరసిస్తూ ఏఐసీసీ పిలుపుమేరకు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారత దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఒక చీకటి రోజు అని, పార్లమెంటు భద్రతా వైఫల్యాల చర్చకు తావివ్వకుండా సభ్యులను బహిష్కరించి, అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా బిజెపి ప్రభుత్వం ప్రవర్తిస్తుందన్నారు. పార్లమెంటులోకి చోచ్చుకొని వచ్చిన అగాంతకులు బిజెపి పార్టీకి సంబంధించిన వారేనని విమర్శించారు. ప్రతిపక్షాలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడడంతోనే బిజెపి పీఠాలు కదులుతున్నాయనిమండిపడ్డారు. సెంటిమెంటును అడ్డుపెట్టుకొని ఎన్నికలకు వచ్చి గెలవడం బిజెపికి ఆడవాయితీగా మారిందని ఎద్దేవా చేశారు. సభ్య సమాజం సిగ్గుపడేలా బిజెపి అనైతిక చర్యలకు పాల్పడుతుందని, సేవ్ డెమోక్రసీ సేవ్ ఇండియా అనే నినాదంతో ఇండియా కూటమి ప్రజల ముందుకు వెళుతుందని, విద్యార్థులు మేధావులు కార్మికులు కర్షకులు ఆలోచించవలసిన అవసరం ఆసన్నమైందన్నారు. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా బిజెపి చేస్తున్న చర్యను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు. బిఆర్ఎస్, బిజెపి పార్టీలు రెండు ఒకటేనని, బిజెపి చేసిన చర్యను అందుకే బిఆర్ఎస్ ఖండించలేదన్నారు. ప్రజాస్వామ్య హక్కులను, పౌర హక్కులను, భారత రాజ్యాంగాన్ని కాలరాస్తున్న బిఆర్ఎస్, బిజెపి పార్టీలకు రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, మహిళా నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >