| Daily భారత్
Logo




వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు

News

Posted on 2026-04-24 14:26:12

Share: Share


వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు

డైలీ భారత్, వేములవాడ: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని డీజీపీ శివధర్ రెడ్డి శుక్రవారం ఐపీఎస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీజీపీ ఆలయ వసతి గృహానికి చేరుకున్న వెంటనే పోలీస్ బృందం గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ ఆనర్) సమర్పించింది. అనంతరం ఆలయంలోకి ప్రవేశించిన ఆయనకు ఆలయ అర్చకులు, వేద పండితులు స్వస్తి వాచకంతో ఘనంగా స్వాగతం పలికారు. తరువాత స్వామివారి మండపంలో అర్చకులు వేద పండితులు తీర్థ ప్రసాదం అందజేసి ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ డీఈఓ భాస్కర శర్మ స్వామివారి శేష వస్త్రం, లడ్డు ప్రసాదం చిత్రపటాన్ని డీజీపీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, వేములవాడ ఆర్డీవో రాధాబాయి, వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, ఆలయ ఏఈఓ జి.అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు

Posted On 2026-09-04 08:53:55

Readmore >