| Daily భారత్
Logo




ఉత్సాహంగా ప్రారంభమైన జర్నలిస్టుల క్రీడా పోటీలు

News

Posted on 2025-08-10 09:55:39

Share: Share


ఉత్సాహంగా ప్రారంభమైన జర్నలిస్టుల క్రీడా పోటీలు

-తొలి రోజు హోరా హోరీ గా క్రికెట్ మ్యాచ్

-క్రీడా స్ఫూర్తి చాటిన జర్నలిస్టులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మానసిక ఉల్లాసానికి క్రీడలు  ముఖ్యమని ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు అంతడుపుల రామకృష్ణ, బైర శేఖర్ అన్నారు. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జర్నలిస్టులకు క్రీడల్లో భాగంగా మొదటి రోజు క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. క్రికెట్లో కట్ట సతీష్ జట్టు, సాక్షి రాజ్ కుమార్ జట్టు పోటీ పడగా టాస్ గెలిచిన కట్ట సతీష్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 12 ఓవర్లలో 89 పరుగులు చేసి మూడు వికెట్లను కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన సాక్షి రాజు టీం 8 ఓవర్లలో 90 పరుగుల లక్ష్యాన్ని చేదించి విజయం సాధించారు. సాక్షి రాజు జట్టు 1 వికెట్ కోల్పోగా ఓపెనర్ గా బ్యాటింగ్ చేసిన  10 టీవీ కృష్ణ 53 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు అంతడుపుల రామకృష్ణ, బైర శేఖర్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం జనవరి 26, ఆగస్టు 15, జర్నలిస్టులకు నిర్వహించే క్రీడల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా యధావిధిగా నిర్వహించామని తెలిపారు. నిర్విరామంగా ప్రతిరోజు వార్తలలో జర్నలిస్టు నిమగ్నమై ఒత్తిడికి గురవుతున్న జర్నలిస్టులకు ఈ పోటీ లు ఉపశమనం కలిగిస్తాయని అన్నారు క్రికెట్ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా జర్నలిస్టుల క్రీడాల కోసం పోలీసు మైదానం కేటాయించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు, ఏ ఆర్ హెడ్ క్వార్టర్ పోలీసులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. క్రీడాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే క్రికెట్ మ్యాచ్ ను ఆర్గనైజింగ్ చేసిన కట్ట సతీష్, షేక్ హైమద్లకు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

Posted On 2026-07-31 07:29:30

Readmore >
Image 1

మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్‌మెంట్

Posted On 2026-07-31 07:06:38

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ

Posted On 2026-07-31 05:05:36

Readmore >
Image 1

కరెంట్ షాక్ తో చనిపోతే ఇచ్చే పరిహారం రూ.8లక్షలకు పెంపు

Posted On 2026-07-31 05:04:07

Readmore >
Image 1

సీనియర్ న్యాయవాది రజాక్ మృతి తీరని లోటు : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

Posted On 2026-07-31 05:03:03

Readmore >
Image 1

అశ్వాపురం మండలంలో సీతారామ పంప్ హౌస్ ను సందర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు పవని గౌడ్

Posted On 2026-07-31 05:01:23

Readmore >
Image 1

నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు

Posted On 2026-07-30 17:36:26

Readmore >
Image 1

సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు

Posted On 2026-07-30 17:09:03

Readmore >
Image 1

సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు

Posted On 2026-07-30 16:35:13

Readmore >
Image 1

గణేష్ ఉత్సవాలకు ముందస్తు వ్యూహం

Posted On 2026-07-30 16:26:39

Readmore >