| Daily భారత్
Logo




తెలంగాణ ఉద్యోగుల పెండింగ్ సమస్యల ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఉద్యమిద్దాం : జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్

News

Posted on 2025-08-01 22:16:25

Share: Share


తెలంగాణ ఉద్యోగుల పెండింగ్ సమస్యల  ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఉద్యమిద్దాం : జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం గత 17 నెలలుగా ఎదురుచూస్తూ అనేక పర్యాయాలు గౌరవ కమిటీ సభ్యులతో రాష్ట్ర ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్  మారం జగదీశ్వర్  సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి తో మంత్రివర్గ ఉప సంఘంతో అధికారుల కమిటీతో చర్చలు జరిపినప్పటికీ   ముఖ్య మంత్రి  మంత్రులు స్పష్టమైన హామీలు ఇచ్చినప్పటికీ ఉద్యోగుల సమస్యలు ఇంకా పెండింగ్లో ఉండడం శోచనీయమని టి జి ఈ జే ఎ సి  నిజామాబాద్ జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్  శుక్రవారం టీఎన్జీవో భవన్ నిజాంబాద్ లో ఏర్పాటు చేసిన జేఏసీ ప్రత్యక్ష సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో తెలిపారు

ముఖ్యమంత్రి  ఆదేశాల ప్రకారం ఉద్యోగస్తుల పెండింగ్ బిల్లులు నెలకు 700 కోట్లు ఉద్యోగ లోకానికి చెల్లిస్తామని చెప్పినప్పటికీ నేటికి కార్యరూపం దాల్చకపోవడం, అలాగే ఎంప్లాయిస్ హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పి నేటికీ చేయకపోవడం ఉద్యోగ లోకాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా భావిస్తున్నామన్నారు

అలాగే 1.7. 2023 నుండి అమలు చేయాల్సిన నూతన వేతన సవరణ మాట ఎత్తకపోవడం అధికారుల కమిటీ 

టీ జి ఈ జె ఎ సి  ఇచ్చిన 57 డిమాండ్లకు సంబంధించిన నివేదికను ఇంతకాలం బయట పెట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా అని... ప్రశ్నించారు కొన్ని శాఖల్లో ఉద్యోగుల ఖాళీలను తగ్గిస్తూ డౌన్ సైజు చేయాలని చూడటం దుర్మార్గం... కొత్త పోస్టులను సృష్టించే క్రమంలో ఖాళీలను కొత్త పోస్టులుగా అప్గ్రేడ్ చేస్తే సరిపోతుంది కనుక ముఖ్యమంత్రి యావత్ మంత్రిమండలి సభ్యుల ఆదేశాలను గౌరవించాల్సిన అధికారులందరూ ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారా అనే అనుమానం కలగకుండా ఉండాలంటే సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తున్నాం అందుకే ఉద్యోగుల జేఏసీ నిజాంబాద్ జిల్లా పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్న ఈ క్రింది ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని మరొక్కసారి విజ్ఞప్తి చేశారు. జేఏసీ ప్రధాన సమస్యలైన క్యాబినెట్ సమావేశంలో ఆమోదించిన విధంగా రాష్ట్రస్థాయిలో నెలకు 700 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు క్రమం తప్పకుండా చెల్లించాలి గత నెల 517 ఈనెల 700 కోట్లు మొత్తం 1217 కోట్ల బకాయిలు ఈ నెలలోనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ను జులై నెలాఖరులోపే పూర్తి స్థాయిలో నిబంధనలను రూపొందించి అమలు చేస్తామని తెలిపిన ప్రభుత్వ అధికారులు 

  నేటికీ కార్యరూపం దాల్చలేదు, వెంటనే చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కమిటీని వేసి విధివిధానాలను ఖరారు చేయాలి పెండింగ్లో ఉన్న 5 డి ఎ  లను తక్షణమే విడుదల చేయాలన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేసి, ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయుటకు తక్షణమే అధికారులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు.  2003 డీఎస్సీ  ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 57 మెమో ద్వారా పాత పెన్షన్ అమలు చేయాలి, కానీ నేటికీ  కార్యరూపం దాల్చలేదు, ఇటీవల హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

పిఆర్సి నివేదికను వెంటనే తెప్పించుకొని 51% ఫిట్మెంట్ అమలు చేయాలన్నారు. వివిధ కారణాలతో సస్పెండ్ అయిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నూతనంగా ఏర్పడిన మండలాలకు ఎంపీ ఓ, ఎం ఈ ఓ పోస్టులను మంజూరు చేయాలని,సెప్టెంబర్ 1 న పెన్షన్ విద్రోహదినంగా పాటిస్తూ, ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుపుతామన్నారు. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జేఏసీ తమ సమస్యల పరిష్కారం కోసం 17 నెలలుగా వేచి చూసినప్పటికీ హామీలు మాత్రమే ఇచ్చిన ప్రభుత్వం ఇకనైనా ఆ హామీలన్నీ పరిష్కరించబడాలని కోరారు. లేనిపక్షంలో జేఏసీ ఆదేశానుసారం సెప్టెంబర్ 1 తర్వాత ఉద్యోగ జేఏసీ  జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని, భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధం కావలసి వస్తుందని టి ఈ జి జేఏసీ  నిజామాబాద్ జిల్లా పక్షాన  జిల్లా చైర్మన్  నాశెట్టి సుమన్ కుమార్  తెలియజేశారు.


Image 1

ప్రమాదకరమైన గుంతను మానవత్వంతో పూడ్చిన యువకులు

Posted On 2025-12-09 15:35:00

Readmore >
Image 1

మా ఇంట్లో ఓట్లు అమ్మబడువు...

Posted On 2025-12-09 15:34:00

Readmore >
Image 1

సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడిన ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్స్ శ్రీనివాస్, గంగారాజు

Posted On 2025-12-09 12:48:45

Readmore >
Image 1

దేవాలయంలో ఈ ఐదు వస్తువులు దానం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది

Posted On 2025-12-09 11:26:29

Readmore >
Image 1

రిజిష్టర్ కాని భూమి కొనుగోలు - పట్టా పాసుపుస్తకం పొందాలంటే?

Posted On 2025-12-09 11:22:22

Readmore >
Image 1

సర్పంచ్ ఎన్నికల్లో సోషల్ మీడియాతో ముందుకు పోతున్న అభ్యర్ధులు

Posted On 2025-12-09 11:21:25

Readmore >
Image 1

నకిలీ బంగారం అమ్ముతున్న ముఠా ను అరెస్టు చేసిన సూర్యాపేట రూరల్ పోలీసులు

Posted On 2025-12-09 08:11:59

Readmore >
Image 1

2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి

Posted On 2025-12-08 19:32:03

Readmore >
Image 1

మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు

Posted On 2025-12-08 18:21:39

Readmore >
Image 1

ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

Posted On 2025-12-08 14:07:07

Readmore >