| Daily భారత్
Logo




గుప్తు నిధుల తవ్వకాలు : స్వామీజీ చెప్పారని తవ్వేశారు

News

Posted on 2023-12-20 05:07:36

Share: Share


గుప్తు నిధుల తవ్వకాలు : స్వామీజీ చెప్పారని తవ్వేశారు

రైల్వే ఉద్యోగి ఇంట్లో రోజూ డీజేలో భక్తి పాటలు.. అనుమానంతో ఆరా తీస్తే!

విశాఖలో గుప్తు నిధుల తవ్వకాలు

స్వామీజీ చెప్పారని తవ్వేశారు

ఏకంగా 20 అడుగుల వరకు గొయ్యి

డైలీ భారత్, విశాఖపట్నం: విశాఖలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో.. తాటిచెట్ల పాలెం రైల్వే క్వార్టర్స్‌లో ఇంటి ఆవరణంలో పూజలు చేసి తవ్వకాలు జరిపారు. రైల్వే ఉద్యోగి ఆధ్వర్యంలో 20 అడుగుల గొయ్యి తవ్వేశారు. గుప్తనిధుల తవ్వకాల కోసం విజయవాడ నుంచి వ్యక్తులు తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. విషయం బయటకు పొక్కడంతో గేట్లకు తాళలు వేసిన సదరు వ్యక్తులు.. దోష నివారణ కోసం పూజలు చేశామంటూ చెప్పుకొస్తున్నారు. విషయం తెలిసిన కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రైల్వే ఉద్యోగి కోటేశ్వరరావు కొద్దిరోజులు క్రితం ఓ స్వామీజీని ఇంటికి తీసుకొచ్చాడు. ఆయన ఇంటి ఆవరణను పరిశీంచి.. ఓ ప్రాంతంలో వైబ్రేషన్స్ వచ్చాయి.. గుప్త నిధులు ఉన్నాయని కోటేశ్వరరావుతో చెప్పాడు. ఇంకేముంది వెంటనే ఓ గ్యాంగ్‌ను పిలిచి తవ్వకాలు చేపట్టాడు. అయితే తవ్వుతున్న శబ్దాలు చుట్టుపక్కలవారికి వినపడకుండా అతి తెలివితో జాగ్రత్తలు తీసుకున్నాడు. డీజే తీసుకొచ్చి పాటలు పెట్టేవాడు.. ఆ సమయంలోనే తవ్వకాలు జరిపేవాడు. మళ్లీ పాట ఆగిపోయిన వెంటనే తవ్వకాలు ఆపేవాడు.. మళ్లీ డీజేలో పాట ఆన్ చేసి తవ్వించేవాడని స్థానికులు చెబుతున్నారు.

తమ ఇంట్లో తవ్వకాలు జరుపుతున్నారని తెలిసి ఇద్దరు వ్యక్తులు వచ్చి మీడియా పేరుతో బెదిరించారని.. వారికి డబ్బులు కూడా ఇచ్చినట్ల కోటేశ్వరరావు తమ్ముడు చెబుతున్నారు. నెల రోజులుగా ఈ గొయ్యి తవ్వుతున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే కొన్ని పూజలు కూడా నిర్వహించినట్లు వివరించారు. ఎవరూ రాకుండా, చూడకుండా చుట్టూ అడ్డుగా చీరల్ని కట్టినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్నామని.. వారిని పిలిచి ప్రశ్నించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. రైల్వే స్థలంలో ఇలా తవ్వకాలు జరపడం నేరం అంటున్నారు.. అలాగే కోటేశ్వరరావును కూడా పిలిపించి మాట్లాడతామంటున్నారు. అలాగే ఆ ఇంటికి వచ్చి గుప్త నిధులు ఉన్నాయని చెప్పిన స్వామీజీల వివరాలు కూడా సేకరించే పనిలో ఉన్నారు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >