Posted on 2023-12-19 13:54:02
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి తెలంగాణలో సంచలనం సృష్టించిన మాక్లూరు వరుస హత్యల ఘటనలో ప్రధాన నిందితుడు ప్రశాంత్ సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ తెలిపారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి.. కేసు వివరాలను ఆమె వెల్లడించారు. నిందితుల వద్ద కారు, బైక్, ఐదు సెల్ఫోన్లు, రూ.30 వేల నగదు, భూమి రిజిస్ట్రేషన్ పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సదాశివనగర్ పీఎస్లో కేసు ఆధారంగా విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.నవంబర్ 29న మాక్లూర్ మండలంలో ప్రసాద్ హత్యకు గురయ్యాడు. మదనపల్లి అటవీ ప్రాంతంలో ప్రశాంత్, వంశీ, విష్ణు అనే ముగ్గురు కలిసి ప్రసాద్ను రాళ్లు, కర్రలతో కొట్టి చంపేశారు. అక్కడే మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ప్రసాద్ జైలులో ఉన్నాడని ఆయన్ని కలుద్దామని చెప్పిఈ నెల 1న ఆయనభార్యశాన్వికనుప్రశాంత్, నిజామాబాద్ తీసుకెళ్లాడు.బాసర వంతెన వద్ద వంశీ, విష్ణుతో కలిసి ఆమెను చంపేసి గోదావరిలో పడేశారు. అదే రోజున ప్రసాద్ చెల్లి శ్రావణిని సైతం తీసుకెళ్లారు. మెదక్ జిల్లా వడియారం వద్ద ఆమెను చంపి తగులబెట్టారు.ప్రసాద్ వద్దకు వెళ్లామని చెప్పి ఆయన తల్లి, పిల్లలు, మరో చెల్లిని కూడా ప్రశాంత్ తీసుకెళ్లాడు. వారిని నిజామాబాద్ లాడ్జిలో ఉంచారు. డిసెంబర్ 4న తమ్ముడితో కలిసి పిల్లల్ని ప్రశాంత్ చంపేసి మెండోర వద్ద సోన్ బ్రిడ్జి వద్ద నీళ్లలో పడేశారు. డిసెంబర్ 13న మరో చెల్లి స్వప్నను సదాశివనగర్ మండలం భూంపల్లి వద్ద చంపి పెట్రోల్ పోసి తగులబెట్టారు. కుటుంబ సభ్యులు రాకపోవడంతో ప్రసాద్ తల్లి సుశీల లాడ్జి నుంచి పారిపోయింది” అని సింధు శర్మవివరించారు. ఆమె కోసం వచ్చినముగ్గురిని అరెస్టు చేసినట్లుచెప్పారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ వద్ద ప్రశాంత్ మరో ఇద్దరునిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ప్రసాద్ కుటుంబ సభ్యుల ఫోన్లు ప్రశాంత్ వద్దలభించాయని ఇప్పటి వరకు 4మృతదేహాలు లభించగా, ప్రసాద్ ఆయన భార్య మృతదేహాలు లభ్యంకాలేదని ఎస్పీ తెలిపారు
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >