భరోసా కేంద్రం సేవలను మరింత విస్తరించి, బాధితుల కోసం ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాం
సిపి సాయి చైతన్య
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బాధిత మహిళలకు, పిల్లలకు సహయం మెరుగైన సేవలు అందిస్తూ భరోసా కేంద్రం అండగా నిలుస్తుందన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కార్యాలయంలో భరోసా కేంద్రంలో నమోదైన పోక్సో, అత్యాచార కేసులలో ఏడు మంది బాధిత పిల్లలకు, మహిళలకు భరోసా కేంద్రం తరపున చెక్కులను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్. చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ భరోసా కేంద్రం ద్వారా మహిళలకు మనో-ధైర్యం, న్యాయం అందించడం పోలీస్ శాఖ యొక్క ముఖ్య లక్ష్యాలలో ఒకటి. ఈ రోజు బాధిత మహిళలకు మరియు పిల్లలకు ఆర్ధిక సాయం కోసం భరోసా కేంద్రం తరపున చెక్కులు అందజేయడం ద్వారా వారి పునర్వాసానికి మనదైన తోడ్పాటు అందించినందుకు సంతృప్తిగా ఉంది. ప్రతీ మహిళాలు, పిల్లలు భద్రతగా, గౌరవంగా జీవించాలన్నదే మా అభిలాష భరోసా కేంద్రం సేవలను మరింత విస్తరించి, బాధి-తుల కోసం ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాం అని తెలియజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వారెడ్డి, భరోసా సెంటర్ కో-ఆర్డినేటర్ జి. రోజా, లీగల్ అడ్వయిజర్ డయాణ గీతిక మహిళా పోలీస్ స్టేషన్ ఎస్.ఐ పుష్పావతి మరియు మౌనిక, సవిత, ఎ.ఎన్.ఎమ్లు తదితరులు పాల్గొన్నారు.