Posted on 2025-07-25 17:36:43
కామారెడ్డి సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శ
ఖర్గే సాక్షిగా చేసిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను అమలుచేయకుండా రేవంత్ దళిత, గిరిజనులను దగా చేశాడు
రాష్ట్ర ఆదాయాన్ని పెంచే సత్తా లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: బాబాసాహెబ్ అంబేద్కర్ స్పూర్తితోనే తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని కేసీఆర్ సాకారం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు చెప్పారు.లక్షలాది మందిని సమీకరించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వాళ్లకు బోధించి, ఎత్తిన జెండా దించకుండా 14 ఏళ్ల పాటు కేసీఆర్ పోరాడితేనే అంబేద్కర్ రాజ్యాంగం ఆధారంగా తెలంగాణ వచ్చిందన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట్ లో నిర్వహించిన దళిత ఆత్మగౌరవ గర్జనలో పాల్గొన్న కేటీఆర్, చేవేళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను అమలుచేయకుండా దళిత, గిరిజనులపై అణిచివేతకు పాల్పడుతున్న రేవంత్ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా వదిలి పెట్టమన్నారు. జై తెలంగాణ ,జై భీమ్ నినాదాలతో ప్రసంగం మొదలు పెట్టిన కేటీఆర్..డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును సెక్రటేరియట్ కు పెట్టిన ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ ఒక్కరే అన్నారు. వేములవాడ పర్యటనలో ఒక్క ప్లేటు భోజనానికి లక్షా 35 వేల రూపాయలు ఖర్చు చేసిన రేవంత్ రెడ్డి, గురుకులాల్లోని దళిత, బహుజన బిడ్డలకు వంద రూపాయలతో మంచి భోజనం ఇవ్వలేకపోతున్నాడని విమర్శించారు. గురుకులాల్లో రేవంత్ ప్రభుత్వం పెడుతున్న విషం తిని ఇప్పటికే వందలాది విద్యార్థులు చనిపోయారన్నారు. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి నాడు లింగంపేట బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పోలీసుల చేతిలో అవమానానికి గురైన సాయిలును కేటీఆర్ ఘనంగా సన్మానించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడిస్తేనే అహంకారంతో విర్రవీగుతున్న రేవంత్ రెడ్డి, ఆయన తొత్తులకు బుద్ది వస్తుందన్నారు.సాయిలుకు జరిగిన అవమానం యావత్ తెలంగాణ సమాజానిది అన్న కేటీఆర్, అందుకు కచ్చితంగా బదులు తీర్చుకుంటామన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఎంతో ముందు చూపుతో అంబేద్కర్ పెట్టిన ఆ ఆర్టికల్ కారణంగానే తెలంగాణ కల సాకారం అయిందన్నారు. బోధించు, సమీకరించు, పోరాడు, అన్న బాబాసాహెబ్ బాటలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ ఉద్యమించారు. లక్షలాది మందిని సమీకరించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వాళ్లకు బోధించి, ఎత్తిన జెండా దించకుండా 14 ఏళ్ల పాటు కేసీఆర్ కొట్లాడితే బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగా తెలంగాణ వచ్చింది. ఆ మహనీయున్ని గౌరవించుకోవడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ప్రతిష్టించుకున్నాము. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమున్నతంగా గౌరవించుకున్నాము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును సెక్రటేరియట్ కు పెట్టిన ఒకే ఒక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ ఒక్కరే అని, అంబేద్కర్ ను అంత గొప్పగా గౌరవించుకున్న ముఖ్యమంత్రి దేశంలో ఇంకెవరూ లేరన్నారు. దళితుల జీవితాల్లో అద్భుతమైన మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో లక్షలాది దళితులకు మేలు చేయాలన్న సంకల్పంతో దళితబంధు పథకాన్ని కేసీఆర్ తీసుకొచ్చారు. దళితబంధు పేరుమీద కేసీఆర్ 10 లక్షల మాత్రమే ఇస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే 12 లక్షలు ఇస్తామని చేవెళ్లలో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ను రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క లు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ పనుల్లో 26% శాతం ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామన్నారు. దళిత, గిరిజనులు ఇండ్లు నిర్మించుకుంటే ఆరు లక్షలు ఇస్తామని ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆరు పైసలు కూడా ఇవ్వని సిగ్గులేని ప్రభుత్వం రేవంత్ రెడ్డిది అని అన్నారు.
ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో అన్ని వర్గాల ప్రజలు దారుణంగా మోసపోయారు.
రెండుసార్లు రైతుబంధును ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయన్న కారణంగా మొన్న రైతుబంధు వేశాడు. అరకొరగా రైతు బంధు వేసి సంబరాలు చేసుకోమంటున్న దిక్కుమాలిన ప్రభుత్వం అని మండిపడ్డారు.
కెసిఆర్ రైతులకు 10,000 ఇస్తే తాము 15000 ఇస్తామన్నారు. ముసలి వాళ్లకు ఇస్తున్న 2 వేల పెన్షన్ ను 4000 చేస్తామన్నారు.
కెసిఆర్ అప్పులపాలు చేశారని కాంగ్రెస్ వాళ్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా కేసీఆర్ ఆపకుండా రైతుబంధు, కేసీఆర్ కిట్లు, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, గురుకులాల్లో సన్న బియ్యం పెట్టారు. ప్రభుత్వాన్ని నడిపే దమ్ము ఉన్నవారికే ఆదాయాన్ని తెచ్చే సత్తా ఉంటుంది. సంపద పెంచి పేదలకు పంచే తెలివి ఉంటుంది. రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రమే టకీ టకీమని డబ్బులు పడుతున్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి బీఆర్ఎస్ ను గెలిపించుకుంటేనే అహంకారంతో విర్రవీగుతున్న రేవంత్ రెడ్డి, ఆయన తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులకు బుద్ది వస్తుందన్నారు. గురుకులాల్లో పిల్లలకు విషం పెడుతున్నారు. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇప్పటికే వందమంది పిల్లలు బలి అయ్యారు. వేములవాడకు వచ్చిన రేవంత్ రెడ్డి తిన్న భోజనం ఖరీదు ఒక ప్లేటుకు లక్ష 35 వేల రూపాయలు. అందాల పోటీల్లో ఒక్క ప్లేట్ భోజనానికి లక్ష రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వానికి కనీసం వంద రూపాయలతో గురుకులాల పిల్లలకు మంచి భోజనం పెట్టాలన్న సోయి లేదని విమర్శించారు.
కెసిఆర్ నాయకత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో తెలంగాణ గురుకులాలు ప్రపంచస్థాయి ప్రమాణాలతో అద్భుతంగా పనిచేశాయన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్
Posted On 2026-04-27 19:01:31
Readmore >
డ్రగ్స్ నిర్మూలన, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీం బృందం
Posted On 2026-04-27 18:56:03
Readmore >
తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవిల... తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు
Posted On 2026-04-27 18:50:27
Readmore >