Posted on 2025-07-24 14:12:44
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గల్లి గల్లి వాడ వాడలో డ్రైనేజ్ డ్రైవ్ కార్యక్రమం విజయవంతం గా కొనసాగుతున్నందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సిబ్బంది నగరంలో పేరుకుపోయిన చెత్తాచెదరాన్ని తొలగిస్తూ శుభ్రతను పాటించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలోనే గ్రామాలతో పాటు మున్సిపల్ కార్యాలయం అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి శుభ్రత పాటించాలని ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన విషయం అందరికి తెలిసిందే. దీంతో నగరం లోని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సిబ్బంది చెత్తాచెదరని తొలగించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. అంతేకాకుండా సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని చెత్తాచెదరం, తో పాటు ఫాగింగ్ కార్యక్రమం ప్రత్యేకంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా చెత్తాచెదరని తొలగించేందుకు ప్రభుత్వపరంగా ఏర్పాటుచేసిన వాహనంలో నగర ప్రజలు సద్వానియోగం చేసుకోవాలని ప్రజలను సంబంధిత అధికారులు సిబ్బంది కోరారు. నగరంలో ఏ ఒక్కరు కూడా అనారోగ్యానికి గురికాకుండా ఉండేందుకు లక్ష్యంగా పనిచేస్తున్నామని వారు తెలియజేస్తున్నారు. నగరంలోని మురికి కాలువలు చెత్తాచెదరంతో కూరుకుపోకుండా దృష్టి సారించినందుకు గల్లి గల్లి వాడ వాడలోని ప్రజలు మున్సిపల్ సిబ్బంది పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తూ జై జై లు పలుతున్నారు. అదేవిధంగా నగరంలోని ఎక్కడైనా చెత్తాచెదరంతో పాటు మురికి కి కాలువల సమస్య తలెత్తిన మరుక్షణమే మున్సిపల్ అధికారులకు సిబ్బంది దృష్టికి తీసుకువచ్చే విధంగా సహకరించాలని వారు కోరుతున్నారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే తక్షణమే మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టి క్లీన్ నగరం తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని వారు అన్నారు.
ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద ఇంటర్నెట్ బంద్!
Posted On 2026-07-22 19:43:08
Readmore >
బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ కేబుల్ చోరీ కేసును ఛేదించిన రామారెడ్డి పోలీసులు... నలుగురు నిందితుల అరెస్ట్
Posted On 2026-07-22 19:03:39
Readmore >
హైదరాబాద్‌లో భారీ బంగారం పట్టివేత : 1.028 కిలోల చోరీ బంగారం రికవరీ, ఇద్దరు అరెస్టు
Posted On 2026-07-22 15:32:51
Readmore >
వనమహోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-07-22 15:05:39
Readmore >
రాహుల్ గాంధీ గారి అరెస్ట్ తీవ్ర అప్రజాస్వామికం: కామారెడ్డి డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్
Posted On 2026-07-22 15:03:11
Readmore >
"కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి" : సైకాలజిస్ట్ పున్నంచందర్
Posted On 2026-07-22 12:40:48
Readmore >