Posted on 2026-07-22 19:03:39
రామారెడ్డి పోలీసుల చాకచక్యంతో బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్‌లో దొంగతనానికి పాల్పడిన నలుగురు నిందితుల అరెస్ట్ – చోరీ సొత్తు స్వాధీనం
డైలీ భారత్, కామారెడ్డి : రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నెం. 156/2026, U/Sec. 331(3), 305(a) BNS కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి, బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్‌లో దొంగతనానికి పాల్పడిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, చోరీకి గురైన కేబుల్ వైర్ బండిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ నెల 18-07-2026న రెడ్డిపేట గ్రామ సమీపంలోని స్వయంభూశ్వరి ఆలయం వద్ద ఉన్న బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కేబుల్ వైర్లను చోరీ చేశారు. ఈ ఘటనపై బీఎస్ఎన్ఎల్ జూనియర్ టెలికాం అధికారి నల్లవెల్లి శ్రీధర్ ఫిర్యాదు చేయగా రామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా 22-07-2026న జగదాంబ తండా జంక్షన్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా వస్తున్న టాటా ఏస్ వాహనాన్ని పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా, అందులోని వ్యక్తులు పారిపోవడానికి యత్నించారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్‌లో కేబుల్ వైర్లు చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుండి చోరీకి గురైన కేబుల్ వైర్ బండిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల వివరాలు
1.పుప్పాల కిరణ్ కుమార్,
ఇసాయిపేట్, రామారెడ్డి
2కల్లెం సతీష్
3..పార్టం గాబ్రియల్
4.గంగారాం
పై ముగ్గురు నిందితులు మెదక్ జిల్లాకు చెందినవారు.
నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరచగా రిమాండ్ విధించడం జరిగింది.
ప్రజలకు విజ్ఞప్తి: ప్రభుత్వ ఆస్తుల దొంగతనాలు, విధ్వంసక చర్యలు లేదా అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని రామారెడ్డి పోలీసులు కోరుతున్నారు.
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >