| Daily భారత్
Logo




"కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి" : సైకాలజిస్ట్ పున్నంచందర్

News

Posted on 2026-07-22 12:40:48

Share: Share


"కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి" : సైకాలజిస్ట్ పున్నంచందర్

ప్రచురణార్థం


తేది. 22-07-2026

కార్మికుల మనోవికాస సదస్సులో సైకాలజిస్ట్ పున్నంచందర్ పిలుపు

డైలీ భారత్, సిరిసిల్ల: కార్మికులు తమ ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ అన్నారు.

మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈరోజు సిరిసిల్ల గణేష్ నగర్‌లో కార్మికులకు మనోవికాస సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ మాట్లాడుతూ.. కార్మికులు కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, పని ఒత్తిడి కారణంగా తమ ఆరోగ్యంపై తగిన శ్రద్ధ చూపడం లేదన్నారు.

ప్రస్తుతం అనేక మంది కార్మికులు జీవనశైలి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా అధిక రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్), అధిక బరువు, గుండె సంబంధిత వ్యాధులు వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు.

శారీరకంగా కష్టపడి పనిచేసే కార్మికులు కూడా తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు.

కార్మికులు క్రమం తప్పకుండా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలని, సమతుల్య ఆహారం తీసుకోవాలని, ఉప్పు మరియు చక్కెర వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. పొగాకు, గుట్కా, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు.

అలాగే ప్రతిరోజూ తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకోవడంతో పాటు, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, శ్వాసాభ్యాసాలు, వ్యాయామం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలని సూచించారు.

ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలుపుతూ కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే వారు తమ కుటుంబాలను సంతోషంగా చూసుకోవడంతో పాటు సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కాగలరు పున్నంచందర్ అన్నారు.

మానసిక సమస్యలు ఎదురైనప్పుడు మనోవికాస కేంద్రాన్ని సంప్రదించి సరైన చికిత్స, కౌన్సెలింగ్ పొందాలని కార్మికులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ సిబ్బంది, బూర శ్రీమతి, కొండ ఉమ, రాపెల్లి లత మరియు కార్మికులు పాల్గొన్నారు.

Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >