| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సొంత ఖర్చులతో గంగస్థాన్ ఫేస్ 1 లో ఏర్పడిన గుంతలను పూడ్చివేయించిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నగేష్ రెడ్డి

సొంత ఖర్చులతో గంగస్థాన్ ఫేస్ 1 లో ఏర్పడిన గుంతలను పూడ్చివేయించిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నగేష్ రెడ్డి

వర్షాల వల్ల ఏర్పడిన గుంతలతో రోడ్డు ప్రమాదాలు అపడమే నా ద్యేయం

మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ నగేష్ రెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంగస్థన్ ఫేస్1 లో 80 ఫీట్ రోడ్డు పై ఉన్న డాంబర్ రోడ్డు పై గుంతలు ఏర్పడడంతో మాజీ నిజామాబాద్ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ నగేష్ రెడ్డి మానవతా దృక్పథంతో ఎవరు గుంతలో పడి ప్రమాదాలకు గురి కావద్దని తన సొంత ఖర్చుతో సిమెంట్, ఇసుక, కంకర లతో గుంతలను పూర్తింపజేశారు. దీంతో ఆయన తీసుకున్న నిర్ణయం పై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రజాప్రతినిధులు ఊరికి ఒక్కరు ఉన్నా గాని దేశం అభివృద్ధి బాటలో నిలుస్తుందని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్న హయాంలోనే ఈ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం నుండి నిధులు తెప్పించిమరి ప్రత్యేకంగా మట్టి రోడ్డు గా ఉన్న రోడ్డును తారు రోడ్డుగా వేయించానని అన్నారు. అలాగే ఈ రోడ్డు ఉందా నిత్యం వందల సంఖ్యలో ద్విచక్ర వాహనదారులు బైపాస్ రోడ్డు వైపు వెళ్తూ ఉంటారని ఇలా గుంతలమయంగా రోడ్డు ఏర్పడడంతో ఇటీవల కాలంలో ఈ రోడ్డు గుండా ప్రమాదాలు ఎక్కువయ్యాయని అందరిని తాను ముందుకు వచ్చి గుంతలు మయంగా మారిన రోడ్డును నా యొక్క బాధ్యతగా రోడ్డు మరమ్మతు  చేయించానని ఆయన అన్నారు. ఎవరూ కూడా రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా సురక్షంగా వారి వారి ఇండ్లలోకి వెళ్లడమే తన ద్యేయం అని అన్నారు.

Previous వైరా నియోజకవర్గం లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు
Next మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న డ్రైనేజ్ డ్రైవ్ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన
ADVERTISEMENT