| Daily భారత్
Logo




వైరా నియోజకవర్గం లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

News

Posted on 2025-07-24 10:17:50

Share: Share


వైరా నియోజకవర్గం లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

యువతకు మార్గనిర్దేశకులు మాజీ మంత్రి కేటీఆర్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ఐటి కి బ్రాండ్ అంబడీసర్ గా కేటీఆర్అభివృద్ధిలో రాష్ట్రానికి వన్నె తెస్తు దేశంలో అగ్రస్థానంలో రాష్ట్రం రాజకీయ దురంధరుడు కేటిఆర్ వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు తెలంగాణ ఐటీ కి బ్రాండ్ అంబాసిడర్ గా  ఉంటూయువతకుమార్గదర్శకంగా నిలుస్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  చిరకాలం ప్రజాసేవలో సేవ కొనసాగాలని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబుఅన్నారు. గురువారం జూలూరుపాడు మండల కేంద్రంలో యల్లంకి సత్యనారాయణ నివాసం వద్ద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలందరి ఆశీర్వాదంతో కేటీఆర్  నిండ నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. మరియు ఏన్కూరు మండలం ప్రధాన రహదారి సెంటర్లో కేక్ కటింగ్ చేయడం అనంతరం నాచారం శ్రీశ్రీశ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినారు ఆలయంలో మొక్కలు నాటడం జరిగింది. లక్ష్యంతో రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని వదిలి,రాష్ట్ర రాజకీయాల్లో అడుగు వేసి  ప్రజల సంక్షేమం కోసం జీవితాన్ని త్యాగం చేస్తున్నా గొప్ప నాయకుడు కేటీఆర్ అని ఆయన అన్నారు. ఆ రోజు రామాయణంలో రాముడు ఏ విధంగా లోకకళ్యాణం కోసం పరిపాలన చేశారో కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ రాష్ట్రంలో రామ రాజ్యం స్థాపన కోసం అహర్నిశలు కృషి చేయడం జరిగిందని తెలిపారు. ఏ ఆశయంతో నైతే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందో ఆ ఆశయ సాధన కోసం తండ్రి  తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయాల్లో అపర చాణక్యుడు అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఐటి హబ్ గా మార్చి వేలాది మంది యువతకు ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నింపిన యువ నాయకుడు కేటీఆర్ అన్నారు. నడక నడవడికలో మాటలో మంచితనం మచ్చలేని నాయకుడు కేటీఆర్ అని కితాబు ఇచ్చారు. ఉన్నత విద్యలు అభ్యసించి లక్షల్లో వేతనం ఉన్నా ఉద్యోగం వదిలి ప్రజాసేవ కోసం  రాజకీయాల్లోకి అడుగు పెట్టారు అని అన్నారు. భవిష్యత్తులో కేటీఆర్  మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా నేడు రాష్ట్రంలో ఎదిగిందన్నారు. నేడు యువత అంతా కేటీఆర్ బాటలో పరిగెడుతున్నారు అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు చావా వెంకట రామారావు సొసైటీ డైరెక్టర్ చాపలమడుగు రామ్మూర్తి లకావత్ హేమ్లా రెడ్డిబోయిన రాము మాజీ ఎంపీటీసీ వాడ వెంకటేశ్వర్లు, భూక్యా దేవిలాల్ నాయక్, మండల నాయకులు తాళ్లూరి రామారావు, పోతురాజు రామారావు, ఇల్లంగి తిరుపతి, యువజన నాయకులు, పొట్ల జగన్,  భూక్యా మహేష్ ఉమ్మడి జిల్లాలో స్టాప్ రిపోర్టర్ గుమ్మడి మహేష్ ప్రతాప్ మరియు తదితరులు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Image 1

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద ఇంటర్నెట్ బంద్!

Posted On 2026-07-22 19:43:08

Readmore >
Image 1

బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ కేబుల్ చోరీ కేసును ఛేదించిన రామారెడ్డి పోలీసులు... నలుగురు నిందితుల అరెస్ట్

Posted On 2026-07-22 19:03:39

Readmore >
Image 1

హైదరాబాద్‌లో భారీ బంగారం పట్టివేత : 1.028 కిలోల చోరీ బంగారం రికవరీ, ఇద్దరు అరెస్టు

Posted On 2026-07-22 15:32:51

Readmore >
Image 1

చర్ల మండలం బక్కచింతలపాడులో నూతన ఎంపీపీ పాఠశాల ప్రారంభం

Posted On 2026-07-22 15:14:56

Readmore >
Image 1

వనమహోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-07-22 15:05:39

Readmore >
Image 1

రాహుల్ గాంధీ గారి అరెస్ట్ తీవ్ర అప్రజాస్వామికం: కామారెడ్డి డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్

Posted On 2026-07-22 15:03:11

Readmore >
Image 1

లాఠీలు, టియర్ గ్యాస్ లు ప్రశ్నలకు సమాధానాలు కావు

Posted On 2026-07-22 14:57:43

Readmore >
Image 1

జనరిక్ మెడిసిన్స్‌పై సుంకాలు ఉండవు.. ట్రంప్ ప్రకటన..

Posted On 2026-07-22 13:03:37

Readmore >
Image 1

"కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి" : సైకాలజిస్ట్ పున్నంచందర్

Posted On 2026-07-22 12:40:48

Readmore >
Image 1

సూసైడ్ నోట్ రాసి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

Posted On 2026-07-22 04:04:12

Readmore >