| Daily భారత్
Logo




ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు

News

Posted on 2025-07-24 16:47:44

Share: Share


ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ స్కూల్ విద్యార్థులకు అభ్యసన సామాగ్రి పంపిణీ

రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసిన కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను గురువారం కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాల మేరకు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సూచనల మేరకు పట్టణ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా పాత కొత్తగూడెం తెలంగాణ స్కూల్లో 9, 10వ తరగతి విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు అందజేసి మాట్లాడారు. ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని తల్లిదండ్రులకు విద్య నేర్పే గురువులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. బాగా చదువుకుని తెలంగాణ స్కూల్ నుంచి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాంటి గొప్ప స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. పలు అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి త్వరగా కోలుకోవాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రుక్మాంగదర్ బండారి, ప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు హుస్సేన్, తోగరు రాజశేఖర్, ఖాజా భక్ష్, రామిళ్ళ మధు, మొయినుద్దీన్, రాసపల్లి శ్రీను, సిద్దు, అశోక్, పూర్ణచందర్, వెన్నెల, మధు, హ్యాపీ, నవనీత్, షణ్ముఖ, అమన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Image 1

నేపాల్ లో 4.2 తీవ్రతతో భూకంపం

Posted On 2026-07-23 04:12:06

Readmore >
Image 1

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద ఇంటర్నెట్ బంద్!

Posted On 2026-07-22 19:43:08

Readmore >
Image 1

బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ కేబుల్ చోరీ కేసును ఛేదించిన రామారెడ్డి పోలీసులు... నలుగురు నిందితుల అరెస్ట్

Posted On 2026-07-22 19:03:39

Readmore >
Image 1

హైదరాబాద్‌లో భారీ బంగారం పట్టివేత : 1.028 కిలోల చోరీ బంగారం రికవరీ, ఇద్దరు అరెస్టు

Posted On 2026-07-22 15:32:51

Readmore >
Image 1

చర్ల మండలం బక్కచింతలపాడులో నూతన ఎంపీపీ పాఠశాల ప్రారంభం

Posted On 2026-07-22 15:14:56

Readmore >
Image 1

వనమహోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-07-22 15:05:39

Readmore >
Image 1

రాహుల్ గాంధీ గారి అరెస్ట్ తీవ్ర అప్రజాస్వామికం: కామారెడ్డి డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్

Posted On 2026-07-22 15:03:11

Readmore >
Image 1

లాఠీలు, టియర్ గ్యాస్ లు ప్రశ్నలకు సమాధానాలు కావు

Posted On 2026-07-22 14:57:43

Readmore >
Image 1

జనరిక్ మెడిసిన్స్‌పై సుంకాలు ఉండవు.. ట్రంప్ ప్రకటన..

Posted On 2026-07-22 13:03:37

Readmore >
Image 1

"కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి" : సైకాలజిస్ట్ పున్నంచందర్

Posted On 2026-07-22 12:40:48

Readmore >