Posted on 2023-09-06 17:30:03
డైలీ భారత్: నల్లొండ జిల్లా కేతిపల్లి మండలం ఇనుపాములలోని VNR డెయిరీని ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. పూర్తి అనుమతులు లేకుండానే, నాణ్యత ప్రమాణాలు పాటించకుండానే, మోతాదుకి మించి కెమికల్స్ వాడుతూ డెయిరీ రన్ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు డెయిరీలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ప్రోటీన్ బైండర్, పాల ఉత్పత్తుల తయారీని పరిశీలించారు. విస్తృతంగా సోదాలు చేసిన అధికారులు అనుమానం ఉన్న డెయిరీ ప్రొడక్ట్స్ శాంపిల్స్ సేకరించారు. వాటిని ల్యాబ్ కి పంపారు. ల్యాబ్ నుంచి రిపోర్టు రాగానే డెయిరీ పై చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు.
డెయిరీలో అపరిశుభ్రత వాతావరణంలో పాల ఉత్పత్తులు తయారీ చేస్తున్నారని, దీంతో నోటీసులు ఇచ్చామని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. పాల ఉత్పత్తులు కల్తీ అయినట్లు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
”అనుమతులు లేకుండానే పాల ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. 6లక్షల రూపాయల విలువైన పాల ఉత్పత్తులను సీజ్ చేశాము. నెయ్యి, ప్రోటీన్ బైండర్స్, 2వేల పాల ప్యాకెట్లు సీజ్ చేశాము. అనుమానిత పదార్ధాలన్నింటిని సీజ్ చేసి ల్యాబ్ కి తరలిస్తున్నాం. హైజీన్ కూడా మెయింటైన్ చేయడం లేదు. పాల ట్రాన్స్ పోర్టుకు లైసెన్స్ కూడా లేదు. పాలు, పాల ఉత్పత్తులు నిల్వ చేసేందుకు కూడా వీఎన్ఆర్ డెయిరీ నిర్వాహాకుల దగ్గర అనుమతి పత్రం లేదు” అని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు.
కాగా, కొన్ని సంస్థలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. నాసిరకం ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. మోతాదుకి మించి హానికారక కెమికల్స్ వాడేస్తున్నాయి. ఆ ఉత్పత్తులనే మార్కెట్ లోకి వదిలి సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ విషయాలేవీ తెలియని ప్రజలు వాటిని కొనుగోలు చేసి తమ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారు.
డబ్బులిచ్చి మరీ జబ్బులు కొంటున్నారు. నాణ్యత లేని, కెమికల్స్ తో చేసిన పాల ఉత్పత్తులతో ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు. చేతులారా జబ్బుల బారిన పడుతున్నారు. నాణ్యత లేని ఆహార పదార్ధాలు తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని అప్పుడే ఇలాంటివి జరక్కుండా ఉండే ఆస్కారం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >