Posted on 2025-07-23 08:19:23
ఎంపీ అర్వింద్ కి లేఖ ద్వారా తెలియజేసిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్:నిజామాబాద్ లో రైల్వే సౌకర్యాలు విస్తరణకు సంబంధించి మరో ప్రాజెక్ట్ కి ముందడుగు పడింది. గత రెండేళ్లుగా ఆర్మూర్ మీదుగా పటాన్ చెరు - ఆదిలాబాద్ మధ్య కొత్త రైల్వే లైన్ వేయాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ని పలుమార్లు కోరిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టు మంజూరు అయ్యిందని రైల్వే మంత్రి, ఎంపీ అర్వింద్ కి లేఖ రాసారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ తయారు చేస్తున్నారని, డీపీఆర్ పూర్తయిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామని మంత్రి లేఖలో పేర్కొన్నారు. కాగా తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి, ఉత్తర తెలంగాణలో ముఖ్యమైన నూతన రైల్వే లైన్ మంజూరు చేసినందుకు ఎంపీ అర్వింద్, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కి ధన్యవాదాలు తెలియజేశారు.
"కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి" : సైకాలజిస్ట్ పున్నంచందర్
Posted On 2026-07-22 12:40:48
Readmore >
జిల్లా కోర్టు ప్రాంగణంలో Special Intensive Revision (SIR) కోసం తాత్కాలిక కామన్ సర్వీస్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాన జిల్లా న్యాయమూర్తి
Posted On 2026-07-21 15:56:05
Readmore >
సిరిసిల్ల : 19వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం
Posted On 2026-07-21 15:22:53
Readmore >
తిమ్మారెడ్డి గ్రామంలో ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం
Posted On 2026-07-21 15:01:38
Readmore >
సిరిసిల్లలో మైనర్ బాలికపై వేధింపుల నిందితుడికి 10 ఏళ్ల జైలు, 2000 జరిమానా
Posted On 2026-07-21 14:56:26
Readmore >
నీట్ పేపర్ లీకేజీ వివాదం : ప్రధాని నివాసం ముందు ప్రతిపక్ష అగ్రనేతల ఆందోళన
Posted On 2026-07-21 13:45:51
Readmore >