Posted on 2026-07-21 15:22:53
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల పట్టణంలోని 19వ వార్డు అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి ప్రారంభించారు. భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించిన ఆమె, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు పురపాలక సంఘం కట్టుబడి ఉందని తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చాలా సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ సీసీ రోడ్డు శిథిలావస్థకు చేరుకోవడంతో గత మున్సిపల్ పాలకవర్గం సమయంలో ఈ సమస్యను ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన చొరవతో రాజ్యసభ సభ్యుడు డి.దామోదర్ రావు ప్రత్యేక నిధుల నుంచి రూ.6 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. అయితే, కొన్ని కారణాల వల్ల అప్పట్లో పనులు చేపట్టలేకపోయామని, ప్రస్తుతం రోడ్డు పొడవు పెరగడంతో అదనపు వ్యయం అవసరమైందని చెప్పారు. అందువల్ల మున్సిపల్ జనరల్ నిధుల నుంచి మరో రూ.3 లక్షలు కేటాయించి, మొత్తం రూ.9 లక్షల వ్యయంతో రహదారిని పూర్తిస్థాయిలో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. పట్టణ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని వార్డుల్లో రోడ్లు, మురుగు కాలువలు వంటి మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తామని, ప్రజల సంక్షేమం, పట్టణ అభివృద్ధే తమ పాలన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం.డి. ఖాదిర్ పాషా, కౌన్సిలర్ బొద్దుల శ్రీనివాస్, డి.ఈ. వాణి, ఏ.ఈ. నరసింహస్వామి, వార్డు పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
#RajannaSircilla #Sircilla #Municipality #CCRoad
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >