Posted on 2026-07-21 15:56:05
డైలీ భారత్, కామారెడ్డి : ప్రజలకు Special Intensive Revision (SIR) కార్యక్రమానికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తులను సులభంగా నమోదు చేసుకునే సౌకర్యం కల్పించేందుకు, జిల్లా న్యాయ సేవా సంస్థ, కామారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కామన్ సర్వీస్ కేంద్రం (Extension Centre) ను ఈ రోజు (21-07-2026) పి. ముక్తిద , ప్రధాన జిల్లా న్యాయమూర్తి & చైర్‌పర్సన్, జిల్లా న్యాయ సేవా సంస్థ, కామారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రధాన జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ, Special Intensive Revision (SIR) కార్యక్రమానికి సంబంధించిన దరఖాస్తులను ప్రజలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తన దృష్టికి న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ద్వారా, అలాగే పత్రికా కథనాల ద్వారా వచ్చినట్లు తెలిపారు. ప్రజల సౌకర్యార్థం జిల్లా కోర్టు ప్రాంగణంలోనే తాత్కాలిక Extension Centre ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని భావించి, జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా జిల్లా కలెక్టర్ గారిని అభ్యర్థించగా, వెంటనే సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులను ఆదేశించి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయించినందుకు జిల్లా పరిపాలనకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కేంద్రం ద్వారా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు సిబ్బంది, అడ్వకేట్ క్లర్కులు, కక్షిదారులు మరియు సాధారణ ప్రజలు SIR దరఖాస్తులను సులభంగా నమోదు చేసుకొని ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎం. రాజేష్ చంద్ర , జిల్లా పోలీసు సూపరింటెండెంట్, శ్రీ విక్టర్ , అదనపు జిల్లా కలెక్టర్, టి. నాగరాణి కార్యదర్శి, జిల్లా న్యాయ సేవా సంస్థ, డా. సూర సుమలత , సీనియర్ సివిల్ జడ్జి, జూనియర్ సివిల్ జడ్జి బి. దీక్ష బి. నారాయణ , బార్ అసోసియేషన్ అధ్యక్షులు, శ్యామ్ గోపాల్ రావు , ప్రభుత్వ న్యాయవాది (GP), హిమబిందు , మండల రెవెన్యూ అధికారి (MRO) పాల్గొన్నారు.
అలాగే కోర్టు ప్రధాన పరిపాలనాధికారి (CAO) రాంచందర్ , సూపరింటెండెంట్ శ్రీ భుజంగరావు , వెంకట్ రెడ్డి , చంద్రసేన్ రెడ్డి , పారా లీగల్ వాలంటీర్ (PLV) విజయ్ కుమార్ , న్యాయవాదులు, న్యాయస్థాన సిబ్బంది, పోలీసు అధికారులు, కక్షిదారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >