| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

హైదరాబాద్‌లో మరో కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌లో మరో కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

డైలీ భారత్, తెలంగాణ : హైదరాబాద్ దుండిగల్ తండాలోని రాంకీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కెమికల్ రియాక్షన్ కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగ, ఎగసిపడుతున్న మంటలను చూసి సమీప తండాల్లో నివాసమున్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. ప్రమాదం సంభవించిన సమయంలో కంపెనీలో ఎంతమంది కార్మికులు ఉన్నారు? వారి పరిస్థితి ఏమిటన్నది తెలియక కుటుంబసభ్యులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Previous ఆర్మూర్ మీదుగా పటాన్ చెరు - ఆదిలాబాద్ కొత్త రైల్వే లైన్ మంజూరు
Next జూలూరుపాడు నుంచి పాపకొల్లు ఆర్ & బి రోడ్డు నిర్మాణ పనులు పూర్తిగా చేపట్టాలి
ADVERTISEMENT