Posted on 2025-07-23 07:05:01
వనస్థలిపురంలో ఫ్రిజ్లో పెట్టిన బోటీ, చికెన్ తిని ఒకరు మృతి..ఎనిమిది మందికి అస్వస్థత
ముగ్గురి పరిస్థితి విషమం
డైలీ భారత్, హైదరాబాద్: ఎల్బీ నగర్ ఫ్రిజ్ లో ఉంచిన బోటీ, చికెన్ కర్రీని వేడిచేసి తినడంతో ఒకరు చనిపోగా ఎనిమిది మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన హైదరాబాద్ వనస్థలిపురం చింతలకుంటలో జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేటకు చెందిన శ్రీనివాస్ యాదవ్ (46), ఆయన భార్య రజిత(38), ఇద్దరు కూతుళ్లు జస్మిత (15), లహరి (17) వనస్థలిపురం చింతలకుంటలోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు.
శ్రీనివాస్ యాదవ్ ఫలక్ నుమా ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 20నబోనాల పండుగ సందర్భంగా ఆయన ఇంటికి తల్లి గౌరమ్మ (65), బావమరిది సంతోష్ కుమార్ (39), అతని భార్య రాధిక (34), వారి కూతుర్లు పూర్విక (12), క్రితగ్న(7) వచ్చారు. పండుగ కావడంతో శ్రీనివాస్.. చికెన్, బోటీ తెచ్చాడు. ఆ రోజు తినగా మిగిలిన చికెన్, బోటీని ఫ్రిజ్లో పెట్టారు. సోమవారం మధ్యాహ్నం వేడి చేసుకుని తిన్నారు. సాయంత్రంకల్లా అందరికీ వాంతులు, విరేచనాలు కావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.
తొమ్మిది మందికి బీపీ పడిపోవడంతో వారిని ఐసీయూలోకి చేర్చారు. శ్రీనివాస్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురై మంగళవారం చనిపోయాడు. మృతుడి తల్లి గౌరమ్మ, కూతురు జస్మిత, భార్య రజిత పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శ్రీనివాస్ యాదవ్ ఆ బోటీ, చికెన్ ఎక్కడ కొన్నాడు, అక్కడ ఏమైనా తప్పిదం జరిగిందా అనే కోణంలో ఎంక్వయిరీ చేస్తున్నారు.
"కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి" : సైకాలజిస్ట్ పున్నంచందర్
Posted On 2026-07-22 12:40:48
Readmore >
జిల్లా కోర్టు ప్రాంగణంలో Special Intensive Revision (SIR) కోసం తాత్కాలిక కామన్ సర్వీస్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాన జిల్లా న్యాయమూర్తి
Posted On 2026-07-21 15:56:05
Readmore >
సిరిసిల్ల : 19వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం
Posted On 2026-07-21 15:22:53
Readmore >
తిమ్మారెడ్డి గ్రామంలో ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం
Posted On 2026-07-21 15:01:38
Readmore >
సిరిసిల్లలో మైనర్ బాలికపై వేధింపుల నిందితుడికి 10 ఏళ్ల జైలు, 2000 జరిమానా
Posted On 2026-07-21 14:56:26
Readmore >
నీట్ పేపర్ లీకేజీ వివాదం : ప్రధాని నివాసం ముందు ప్రతిపక్ష అగ్రనేతల ఆందోళన
Posted On 2026-07-21 13:45:51
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్లకు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి చొరవ
Posted On 2026-07-21 12:52:04
Readmore >