| Daily భారత్
Logo




ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా

News

Posted on 2025-07-22 02:49:41

Share: Share


ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా

డైలీ భారత్, న్యూఢిల్లీ:ఉపరాష్ట్ర పతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం (జులై 21) తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు తెలిపారు. జగదీప్ ధన్కడ్ 2022 జులై 16 న ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.

రైతు కుటుంబంలో పుట్టి..

1951 మే 18న రాజస్థాన్‌లోని కితానా అనే మారుమూల గ్రామానికి చెందిన సాధారణ రైతు కుటుంబంలో జగదీప్ జన్మించారు. చిత్తోడ్ ఘఢ్‌ సైనిక్‌ స్కూల్‌లో ప్రాథమిక విద్య అభ్యసించిన ఆయన.. జైపూర్‌ రాజస్థాన్‌ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. జనతాదళ్‌ తరపు నుంచి 9వ లోక్‌సభ ఎన్నికల్లో ఝుంఝును స్థానం నుంచి జగదీప్ ధన్కర్ ఎంపీగా విజయం సాధించారు. 1993లో కిషన్ ఘడ్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2003లో ఆయన బీజేపీలో చేరారు. 2019లో కేంద్రం జగదీప్ ను బెంగాల్ గవర్నర్ గా నియమించింది.

సుప్రీంకోర్టు లాయర్

జగదీప్ ధన్కర్ రాజస్థాన్‌ హైకోర్టు బార్‌ అసోషియేషన్‌ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహించారు. ఇంటర్నేషనల్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌లో మెంబర్‌గా వ్యవహరించారు. కొన్నాళ్ల పాటు సుప్రీం కోర్టులోనూ పని చేశారు.

Image 1

కరుడుగట్టిన రౌడీ షీటర్ బొజ్జ భాగ్యరాజ్‌పై పి.డి. చట్టం

Posted On 2026-07-21 17:10:38

Readmore >
Image 1

జిల్లా కోర్టు ప్రాంగణంలో Special Intensive Revision (SIR) కోసం తాత్కాలిక కామన్ సర్వీస్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాన జిల్లా న్యాయమూర్తి

Posted On 2026-07-21 15:56:05

Readmore >
Image 1

సిరిసిల్ల : 19వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం

Posted On 2026-07-21 15:22:53

Readmore >
Image 1

తిమ్మారెడ్డి గ్రామంలో ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం

Posted On 2026-07-21 15:01:38

Readmore >
Image 1

సిరిసిల్లలో మైనర్ బాలికపై వేధింపుల నిందితుడికి 10 ఏళ్ల జైలు, 2000 జరిమానా

Posted On 2026-07-21 14:56:26

Readmore >
Image 1

నీట్‌ పేపర్‌ లీకేజీ వివాదం : ప్రధాని నివాసం ముందు ప్రతిపక్ష అగ్రనేతల ఆందోళన

Posted On 2026-07-21 13:45:51

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్లకు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి చొరవ

Posted On 2026-07-21 12:52:04

Readmore >
Image 1

మాతా-శిశు ఆరోగ్య సంరక్షణలో తెలంగాణకు జాతీయస్థాయి గుర్తింపు

Posted On 2026-07-21 07:46:47

Readmore >
Image 1

కూలుతున్న పైకప్పు.. వణుకుతున్న పసిప్రాణాలు!

Posted On 2026-07-21 07:12:29

Readmore >
Image 1

సిక్కిం : కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!

Posted On 2026-07-21 06:12:30

Readmore >