| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దాశరథి జయంతిని జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయం

దాశరథి జయంతిని జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయం

మహాకవి డా. దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాలు

హాజరై తన ఆట పాటలతో నేటి తరానికి సందేశం ఇచ్చిన గద్దర్ కూతురు వెన్నెల

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: కవులు కళాకారుల సేవలు వెలకట్టలేనివని, దాశరథి జయంతిని జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమని తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ డా. వెన్నెల అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కవులు కళాకారులకు గౌరవం పెరిగిందని, దాశరథి జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపనుందని ఈ సందర్భంగా వెల్లడించారు.  మహాకవి డా. దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాలు సోమవారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో దాశరథి కృష్ణమాచార్య జయంతి నిర్వహణ కమిటీ సిర్ప లింగం, దాశరథి కృష్ణమాచార్య జయంతి నిర్వహణ కమిటీ సభాధ్యక్షులు కోనేరు సాయికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం కవులు, కళాకారులు పాల్గొని దాశరథి రాసిన పాటలు, కవితలు పాడి వినిపించారు. కళాకారులను సన్మానించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ డా. వెన్నెల, తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ కనకయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, ప్రముఖ వైద్యురాలు డా. కవిత హాజరయ్యారు. దాశరథి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ వెన్నెల మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కవులు కళాకారులకు పెద్దపీట వేస్తుందన్నారు. కవులు కళాకారులు ఎక్కడైతే ప్రోత్సహించబడతారో అక్కడ సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. తొలి దశ ఉద్యమంలో నిజామాబాద్ జిల్లా ఖిల్లా జైలులో దాశరథి రాసిన తెలంగాణ కోటి రతనాల వీణ 1969 తెలంగాణ ఉద్యమంలో, మలిదశ ఉద్యమానికి స్ఫూర్తిని నింపిందని అన్నారు. దాశరథిని జైలులో బంధించిన కవిత్వం రాస్తూ, ప్రశ్నించడం గొప్ప విషయం అన్నారు.  ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులు కాసర్ల నరేష్ రావు, శ్రీనివాస్ ఆర్య,  మద్దుకూరి సాయి బాబు,  అష్ట గంగాధర్, కర్క రమేష్, సాయి లవోల, దారం పోతన్న, ఆంజనేయులు, కవులు, కళాకారులు పాల్గొన్నారు.

Previous అన్ని మండల కేంద్రాల్లో రేషన్‌కార్డుల పంపిణీ : సీఎం రేవంత్‌రెడ్డి
Next ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా
ADVERTISEMENT