| Daily భారత్
Logo




అన్ని మండల కేంద్రాల్లో రేషన్‌కార్డుల పంపిణీ : సీఎం రేవంత్‌రెడ్డి

News

Posted on 2025-07-21 17:24:29

Share: Share


అన్ని మండల కేంద్రాల్లో రేషన్‌కార్డుల పంపిణీ : సీఎం రేవంత్‌రెడ్డి

డైలీ భారత్, హైదరాబాద్‌: జిల్లాల పరిధిలోని ఐఏఎస్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, రోజూ కలెక్టర్లు ఏ పనిచేశారో తనకు తెలియజేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

వారి కార్యాచరణ రిపోర్టు రోజూ తనకు పంపించాలన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. వర్షాలు, వానాకాలం పంటసాగు, సీజనల్‌ వ్యాధులు, రేషన్‌కార్డుల పంపిణీ తదితర అంశాలపై చర్చించారు.

'రాష్ట్రంలో సరిపడినంత ఎరువులు ఉన్నాయి. ఆందోళన అవసరం లేదు. ఎరువుల దుకాణాల్లో ఎంత స్టాక్‌ ఉందో బయట నోటీస్‌ బోర్డు పెట్టాలి. రాయితీ ఎరువులను ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకోవాలి. కలెక్టర్లు వాటర్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టాలి. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టర్లు ఖర్చు చేసేందుకు ఒక్కొక్కరికి రూ.కోటి కేటాయించాలి.

ఇప్పటి వరకు 7లక్షలకుపైగా కొత్త రేషన్‌కార్డులు ఇచ్చాం. ఈనెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు రేషన్‌కార్డుల పంపిణీ చేయాలి. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలి. అన్ని మండల కేంద్రాల్లో పంపిణీ జరగాలి. రేషన్‌ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ.. ఆందోళన అవసరం లేదు' అని సీఎం అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు పాల్గొన్నారు.

Image 1

మాతా-శిశు ఆరోగ్య సంరక్షణలో తెలంగాణకు జాతీయస్థాయి గుర్తింపు

Posted On 2026-07-21 07:46:47

Readmore >
Image 1

కూలుతున్న పైకప్పు.. వణుకుతున్న పసిప్రాణాలు!

Posted On 2026-07-21 07:12:29

Readmore >
Image 1

సిక్కిం : కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!

Posted On 2026-07-21 06:12:30

Readmore >
Image 1

మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

Posted On 2026-07-21 04:16:53

Readmore >
Image 1

తరగతులకు రోజూ హాజరుకావాలి.. ప్రణాళిక ప్రకారం చదవాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-07-20 17:26:49

Readmore >
Image 1

శబరిమల బంగారు దోపిడీ కేసులో తుది నివేదికను వీలైనంత త్వరగా సమర్పించాలి...

Posted On 2026-07-20 16:40:30

Readmore >
Image 1

జిల్లా మెజిస్ట్రేట్ కే షాక్ ఇచ్చిన 8వ తరగతి కుర్రాడు..

Posted On 2026-07-20 16:21:25

Readmore >
Image 1

బ్యాంకుల్లో ఆకస్మిక తనిఖీలు... ప్రజల భద్రతే లక్ష్యంగా బాన్సువాడ పోలీసులు

Posted On 2026-07-20 16:14:17

Readmore >
Image 1

"ఒకటికి ఐదు రెట్లు" బ్లాక్ మనీ ఆశ చూపి దోపిడీ

Posted On 2026-07-20 15:13:02

Readmore >
Image 1

ప్రతీకూల పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు ఎంతో ఉత్తమం

Posted On 2026-07-20 14:55:09

Readmore >