| Daily భారత్
Logo




"ఒకటికి ఐదు రెట్లు" బ్లాక్ మనీ ఆశ చూపి దోపిడీ

News

Posted on 2026-07-20 15:13:02

Share: Share


"ఒకటికి ఐదు రెట్లు" బ్లాక్ మనీ ఆశ చూపి దోపిడీ

డైలీ భారత్, తిరుపతి: అసలు నోట్లు ఇస్తే దానికి ఐదు రెట్లు ఎక్కువ మొత్తంలో బ్లాక్ మనీ లేదా నకిలీ నోట్లు ఇస్తామని నమ్మించి, అమాయకులను నిలువునా దోచుకుంటున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును తిరుపతి జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారితో సహా ఐదుగురు నిందితులను పిచ్చాటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

తిరుపతికి చెందిన అజ్మీరా రాజారామ్‌ అనే వ్యక్తికి ఈ ముఠా ప్రధాన నిందితుడు ప్రకాష్‌ పరిచయమయ్యాడు. తన వద్ద రూ. 2 వేలు, రూ. 500 విలువైన బ్లాక్ మనీ నోట్లు ఉన్నాయని, ఒక అసలు నోటు ఇస్తే దానికి బదులుగా ఐదు రెట్లు ఎక్కువ కరెన్సీ ఇస్తానని రాజారామ్‌ను నమ్మించాడు. అతని మాటలు నమ్మి పిచ్చాటూరు వచ్చిన రాజారామ్‌కు ప్రకాష్‌ తన ఇంట్లో ఉన్న నోట్ల కట్టలను చూపించాడు.

తీరా లోపలికి వెళ్లి చూసేసరికి అవి అసలు నోట్లు కావని, పిల్లలు ఆడుకునే "టాయ్ కరెన్సీ" (Toy Currency) అని బాధితుడు గుర్తించాడు. మోసాన్ని గ్రహించి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించగా, ముఠా సభ్యులు ఒక్కసారిగా కత్తులతో రాజారామ్‌పై దాడికి దిగారు. చంపుతామని బెదిరించి అతని వద్ద ఉన్న రూ. 20,000 నగదును బలవంతంగా లాక్కున్నారు.

బాధితుడు రాజారామ్‌ ఇచ్చిన ఫిర్యాదుతో పిచ్చాటూరు పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో నిందితులు ఉన్నట్లు అందిన పక్కా సమాచారంతో పోలీసులు మెరుపు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్ అయిన వారిలో ప్రధాన నిందితుడు ప్రకాష్‌తో పాటు మురళి, షేక్ అబ్దుల్ అక్రమ్, పల్లపు రవి కుమార్, కర్రేటి ప్రణయ్ ఉన్నారు. మరో నిందితుడు అశోక్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నివాసాల నుంచి 50 కట్టల టాయ్ కరెన్సీ నోట్లను, రూ. 5,000 విలువైన నకిలీ నోట్లను, దాడికి ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇలాంటి అంతర్రాష్ట్ర ముఠాలు తిరుపతి పరిసర ప్రాంతాల్లో గతంలోనూ యాక్టివ్‌గా ఉన్నాయని, ఏర్పేడు పరిధిలోనూ ఒక రూపాయికి మూడు రూపాయల నకిలీ నోట్లు ఇస్తామన్న ఆశతో ఇద్దరు అన్నదమ్ములు ఏకంగా రూ. 14 లక్షలు పోగొట్టుకున్నారని పోలీసులు గుర్తు చేశారు. తక్కువ డబ్బుకు ఎక్కువ కరెన్సీ ఇస్తామనే మోసపూరిత ఆఫర్లను నమ్మి ప్రజలు తమ కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దని తిరుపతి జిల్లా పోలీసులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >
Image 1

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-09-09 08:34:54

Readmore >
Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >